English | Telugu
బిగ్ బాస్ హౌస్ లో మేకప్ వేసుకోలేదు అంటున్న రమ్య మోక్ష
Updated : Oct 31, 2025
రమ్య మోక్ష అంటే తెలియకపోవచ్చు కానీ చిట్టి పికిల్స్ అంటే అందరికీ సుపరిచితమే. సోషల్ మీడియాలో ఈమె చాలా ఫేమస్. దాని కారణంగానే బిగ్ బాస్ సీజన్ 9 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చాలామంది ట్రోలింగ్ కూడా చేశారు. ఐతే ఇప్పుడు ఆమె ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. "నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడి నీరు వాతావరణం అస్సలు పడలేదు. పైగా థైరాయిడ్ సమస్యలు కూడా ఉన్నాయి. వాటి కారణంగా నా చేతులు, మెడ, శరీరం మొత్తం మీద స్కిన్ ఇన్ఫెక్షన్స్, దద్దుర్లు రావడం మొదలుపెట్టాయి.
అలాగే నాకు టాన్సిల్స్, ఇంకా గొంతు సమస్యలు కూడా ఉన్నాయి. ఇక ఈ టైములో నేను జంక్ ఫుడ్ తిన్నాను, సోడాలు వంటివి తాగడంతో నాకు హై ఫీవర్ వచ్చింది అలాగే డయేరియా బారిన పడ్డాను. ఈ ఆరోగ్య సమస్యలేవీ టీవీలో చూపించలేదు. బిగ్ బాస్ హౌస్ లో రియల్ గా జరిగిన ప్రతిదాన్ని వివరిస్తూ నేను త్వరలో ఒక వీడియో చేస్తాను. నేను నెగటివిటీ పట్టించుకోను, దాన్ని ఇగ్నోర్ ఎలా చేయాలో బాగా తెలుసు" అంటూ చెప్పింది. అలాగే మరో స్టేటస్ లో "ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో నన్ను చూడండి జనాలు ఈ వీడియోను తీసి పోస్ట్ చేశారు. ఎడిటింగ్ చేసిన ఫోటో కాదు. టీవీలో ఎవరైనా సరే సహజంగానే కొంచెం బొద్దుగా కనిపిస్తారు. నేను ఎలాంటి మేకప్ కూడా వేసుకోను ఎందుకంటే ఆ మేకప్ వలన నా కళ్ళ నుంచి నీళ్లు వస్తూ ఎర్రగా మారిపోతాయి అంతే కాదు మేకప్ వలన నాకు జలుబు, తలనొప్పి కూడా వచ్చేస్తాయి. త్వరలో నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ కి వస్తాను. నా మంచి, చెడు సమయాల్లో నాతో ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు." అంటూ పోస్ట్ చేసింది.