English | Telugu

Shivaji Buzz : భయం నా బ్లడ్ లోనే లేదు.. బజ్ ఇంటర్వ్యూలో మాధురి బోల్డ్ డైలాగ్స్!

బిగ్‌బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం దువ్వాడ మాధురి ఎలిమినేషన్ అయింది. చివరి రౌండ్ లో గౌరవ్, మాధురి ఉండగా తనూజ తన గోల్డెన్ బజ్ పవర్ ని యూజ్ చేయకపోవడంతో మాధురి ఎలిమినేషన్ అయింది.

ఇక ఎలిమినేషన్ తర్వాత శివాజీ బజ్ ఇంటర్వ్యూకి వచ్చింది మాధురి. ఇక తను వచ్చీ రాగానే శ్రీజతో జరిగిన గొడవ గురించి ప్రస్తావించాడు శివాజీ. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి మాధవినా లేక మాధురీనా అని శివాజీ అనగానే.. నా పేరు మాధురి మాధవి కాదని తను చెప్పింది. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకి గొడవ ఉండేది కాదు కదా ఆ అమ్మాయితో అని శివాజీ అనగానే.. అందరికీ ఎలా చెప్తాను.. నాకు నచ్చితే చెప్తానంటూ మాధురి సమాధానమిచ్చింది. 100 పర్సెంట్ నేను తెలుగు ఇళ్లల్లోకి వెళ్లాలి అనుకున్నారు.. అని శివాజీ అడిగితే వెళ్లాను.. అని మాధురి చెప్పింది. వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు.. అని శివాజీ సూటిగా అడిగాడు. నేను రావాలి అనుకున్నాను కాబట్టి వచ్చాను.. నాకు యాక్టింగ్ రాదు .. మాస్క్‌లు లేనే లేవు నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నా.. అని మాధురి చెప్పింది. అది ఎవరూ అడగలేదే.. అంటూ శివాజీ సెటైర్ వేశాడు. బిగ్‌బాస్‌లో ఎప్పుడూ కూడా ఎంత పెద్ద తోపున్నా సరే.. అని శివాజీ ఏదో చెప్పబోతుంటే ఇప్పుడెవరూ తోపులని అనుకోవడం లేదు.. తోపు అనట్లేదు.. అని మాధురి ఫైర్ అయింది. నేను మీ గురించి అనట్లేదు మీరు తోపని ఎవరూ అనలేదు కానీ.. అంటూ శివాజీ కౌంటర్ ఇచ్చాడు.

బయటైతే జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతా అన్నారు.. అలా ఎలా కొడతారండీ అని శివాజీ అడుగగా..‌ నాకు ఆటిట్యూడ్ ఉంది..‌ట్రిగ్గర్ అయితే నాకు కోపం వచ్చేస్తుందని మాధురి అంది. ఈ విధంగా మాట్లాడితే ఉండనిస్తారా ఆడియన్స్ అని శివాజీ అడుగగా.. ఉండనిస్తారా ఉండనివ్వరా అంటే ఆడియన్స్ ప్రకారమే నేను మాట్లాడాలా అంటూ మాధురి అంది. మీరు అందుకే ఇక్కడికి వచ్చారు కదా అని శివాజీ ఏదో అడిగితే నేను వెళ్లాలనుకున్నాను వెళ్లాను.. రావాలనుకున్నాను వచ్చానంటూ మాధురి సూటిగా చెప్పింది. అంటే ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయానంటే ఎలాగండీ.. అంటూ శివాజీ అన్నాడు. కూర్చోండి అన్నప్పుడు కూర్చోపోతే మాట్లాడరా అంటే అర్థమేంటి అని శివాజీ అడిగాడు. ఏ అంటే తప్పా అని మాధురి అంది. దీంతో శివాజీ ఏదో చెప్పబోతుంటే.. డాక్టర్ దగ్గరికెళ్తే ఏమన్నాడంటే గట్టిగా అరవకు.. గట్టిగా మాట్లాడకు.. నువ్వు మాట్లాడిన ప్రతిసారీ నీకు తెలీకుండా ఒక నెగెటివిటీ స్టార్ట్ అవుతుంది.. మీరు హౌస్‌లో కూర్చొని చేసే ప్రతీ వాదన భయపెట్టేలా ఉందని శివాజీ చెప్తుంటే మీకా అంటూ మాధురి అంది. దీంతో అమ్మా తల్లి నాకు కాదమ్మా.. లోపల ఉన్న సాయికి.. అని శివాజీ దండం పెట్టాడు. శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక తనని చూసి కాస్త భయపడ్డట్టు అనిపించిందే ఒక దశలో అని శివాజీ అడిగాడు. భయమనేది నా బ్లడ్‌లో కూడా లేదండి అని మాధురి అనగానే సినిమా డైలాగ్ వద్దండి అని శివాజీ అన్నాడు. అది నా డైలాగ్ .. సినినా వాళ్ళు కాపీ కొట్టారని మాధురి అంది. అయినా నేను చాలావరకు కంట్రోల్ లో ఉన్నాను.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసని మాధురి అనగానే మళ్ళీ సినిమా డైలాగ్ అని శివాజీ అన్నాడు. అయినా నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను.. ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటానని మాధురి అంది. సరే అండి మీ ఇష్టమని శివాజీ అన్నాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.