English | Telugu

Bigg Boss 9 Telugu: బిర్యానీ కోసం అలిగిన మాధురి.. బ్రతిమిలాడిన భరణి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఎనిమిదో వారం వీకెండ్ వచ్చేసింది. నాగార్జున ఫైర్ మీద కాకుండా కూల్ గా వచ్చాడు. ఇక వచ్చీరాగానే శుక్రవారం నాడు జరిగిన టాస్క్ ని చూపించాడు. థమ్స్ అప్ టాస్క్ అది.. ఆ టాస్క్ లో భరణి టీమ్ గెలుస్తుంది. వాళ్ళు బిర్యానీతో పాటుగా కూల్ డ్రింక్స్ గెల్చుకుంటారు. భరణి తన టీమ్ లోని మెంబర్స్ కి బిర్యానీ సర్వ్ చేస్తాడు. అప్పుడే ఆపోజిట్ టీమ్ అయిన మాధురి ప్లేట్ తీసుకొని భరణి దగ్గరికి వస్తుంది. ఒక నిమిషం మాధురి గారు మా టీమ్ వాళ్ళకి వేసాక వేస్తానని భరణి అంటాడు. దాంతో మధురి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

మాధురి దగ్గరికి భరణి వచ్చి తినడానికి రండి అని అంటాడు. వద్దని మాధురి అంటుంది. ప్రతీ చిన్న విషయానికి మీరు ఇలా చెయ్యొద్దు మాధురి గారు అని భరణి అంటాడు. ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది.. ప్లేట్ పట్టుకొని తినడానికి నిల్చుంటే అలా వద్దని ఎవరైనా అంటారా అని మాధురి బాధపడుతుంది. భరణిని మాధురి అడుగుతుంటే దివ్య మధ్యలో ఇన్వాల్వ్ అయి ఏదో మాట్లాడుతుంటే.. నేను నీతో ఏం మాట్లాడట్లేదు.. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావని దివ్యపై మాధురి కోప్పడుతుంది.

ఆ తర్వాత భరణి దగ్గరికి తనూజ వచ్చి.. మీ విషయాల్లో ప్రతీ దాంట్లో ఎందుకు తను ఇన్వాల్వ్ అవుతుంది. టాస్క్ పరంగా అయితే ఒకేగానీ ఇలా ప్రతీదానికి తనే ముందకూ వస్తుంటే చూసేవాళ్ళకి చిరాకుగా ఉంటుందని భరణికి తనూజ సలహా ఇస్తుంది. అదే టాపిక్ గురించి వీకెండ్ లో నాగార్జున అడుగుతాడు. నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావ్ దివ్య.. అసలు అక్కడ నీ అవసరం ఏముందని నాగార్జున అడుగుతాడు. గొడవ అవుతుంది కదా.. కెప్టెన్ గా కూల్ చేద్దామని ట్రై చేశానని దివ్య వివరణ ఇస్తుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.