English | Telugu
Bigg Boss 9 Telugu : భరణి, శ్రీజ ఇద్దరిలో రీఎంట్రీగా ఎవరు వస్తారంటే!
Updated : Oct 30, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో భరణి, శ్రీజ ఇద్దరు రీఎంట్రీ ఇస్తారు. అయితే శ్రీజ, భరణి ఇద్దరిలో ఎవరో ఒకరే హౌస్ లో పర్మినెంట్ అవుతారు. వాళ్ళకి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. వాళ్లకి హెల్ప్ గా ఇద్దరిని తీసుకోమని చెప్తాడు. ఇక హౌస్ లో టాస్క్ లో బాగా ఆడేవాళ్ళని శ్రీజ, భరణి సెలెక్ట్ చేసుకోవడం ప్రారంభించారు. నా టీమ్ లో ఆడు అంటూ ఇద్దరు కంటెస్టెంట్స్ ని రిక్వెస్ట్ చేశారు. ఇక శ్రీజ, భరణి రెండు టీమ్ లుగా ఉన్నారు.. ఒకటి రెడ్ టీమ్.. ఇంకొకటి బ్లూ టీమ్.
భరణిది బ్లూ టీమ్.. తనకి సపోర్ట్ గా ఇమ్మాన్యుయల్, నిఖిల్ ని తీసుకోగా.. శ్రీజది రెడ్ టీమ్ తాను సపోర్ట్ గా తీసుకుంది గౌరవ్, డిమాన్ పవన్ ని..... బాక్స్ లోపల ఎవరిది ఎక్కువ వరుసలుగా కాయిన్స్ బాక్స్ లో పెడుతారో వాళ్లే విన్ అవుతారు. అలా టాస్క్ లు విన్ అయినా కొద్దీ ఎవరి టీమ్ వాళ్ళు వారు తన జెండాని పెట్టాలి. ఇక టాస్క్ మొదలవుతుంది. నిఖిల్, భరణి, ఇమ్మాన్యుయల్ ముగ్గురు ఆడుతారు. మరొకవైపు శ్రీజ, గౌరవ్, డీమాన్ ఆడుతారు. టాస్క్ లో ఇరు టీమ్ లో నువ్వా నేనా అంటూ తలపడుతారు. ఒకరు పెడుతుంటే ఇంకొక టీమ్ నెట్టేస్తారు. అలా బజర్ మ్రోగే టైమ్ కి శ్రీజ టీమ్ వి నాలుగు వరుసలు ఉంటాయి కానీ బాక్స్ లో ఒక పది శాతం మాత్రమే ఉంటుంది. అయితే భరణి టీమ్ ఒక్క కాయిన్ ఉంటుంది. అది బాక్స్ లో ఉంటుంది. దానికి సంఛాలక్ గా కళ్యాణ్, సుమన్ ఉంటారు. ఇద్దరు కూడా ఆ టాస్క్ లో ఎవరికి విన్ ఇవ్వాలో చాలా సేపు డిస్కషన్ చేసుకుంటారు. దాంతో మీరు ఇద్దరు సంచాలక్ గా ఫెయిల్యూర్ అయ్యారు.. భరణి, శ్రీజ మీరే ఎవరో ఒకరిని ఎంచుకోండి అని బిగ్ బాస్ చెప్పగా ఇద్దరు మాధురిని ఎంచుకుంటారు. శ్రీజ టీమ్ విన్ అయింది అని మాధురి చెప్తుంది. ఎక్కువ భాగం కాయిన్స్ బాక్స్ లో లేకపోయిన నాలుగు లేయర్స్ ఉన్నవి. వాళ్ళది ఒక్కటే లేయర్ ఉందని మధురి చెప్తుంది. ఇక మొదటి టాస్క్ కి శ్రీజ టీమ్ విన్ అవుతుంది. హౌస్ లో శ్రీజ, భరణి ఇద్దరిలో ఎవరు పర్మినెంట్ కంటెస్టెంట్ అవుతారో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ కోసం వేచి ఉండాల్సిందే.