English | Telugu

Jayam serial : గంగకి నిజం చెప్పేసిన వీరు.. ఇషిక ప్లాన్ విని అతను షాక్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -97 లో.....వీరు గురించి గంగ చెప్తుంటే ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మరు. గంగ ఇక్కడ నుండి వెళ్ళిపో ప్రీతీ ప్రెగ్నెంట్.. ఇప్పుడు తను ఈ సిచువేషన్ లో టెన్షన్ పడొద్దని రుద్ర అంటాడు. అలాంటి విషపురుగుకి బిడ్డ ప్రీతీ గారి కడుపులో పెరగకపోవడమే మంచిది అని గంగ అనగానే.. నా కూతురు కడుపులో పెరిగే బిడ్డ గురించి అలా అంటావా అని గంగ చెంప చెల్లుమనిపిస్తుంది శకుంతల. కాసేపటికి గంగని మెడపట్టుకొని బయటకు గెంటేస్తుంది.

గంగ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వీరు వచ్చి పాపం గంగ అని అంటాడు. నువ్వెందుకు ఈ కుటుంబానికి అంత అన్యాయం చెయ్యాలని చూస్తున్నావని గంగ అడుగుతుంది. ఈ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను.. నేను మార్టిన్ తో చెప్పినవన్నీ నిజాలు. ఇప్పుడేం చేస్తావే అని వీరు అనగానే గంగ తన కాలర్ పట్టుకుంటుంది. అప్పుడే రుద్ర వస్తాడు. తను రావడం చూసి వీరు యాక్టింగ్ మొదలుపెడతాడు. వీరు కాలర్ పెట్టుకుంటావా అని గంగని రుద్ర కొడుతాడు. గంగ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రీతీ దగ్గరికి రుద్ర వస్తాడు. నాకు మా ఆయనపై నింద వేసిందని బాధలేదు. దీనివల్ల అమ్మ నీపై ఇంకా కోపం పెంచుకుందని రుద్రతో ప్రీతీ అంటుంది. అదంతా వీరు విని ఇంకెన్నాళ్ళో మీ ప్రేమలు.. అదీ చూస్తాను.. ఒక్కొక్కరిగా అందరిని రుద్రకి దూరం చేస్తానని వీరు అనుకుంటాడు.

మరొకవైపు గంగ బాధపడుతూ వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్తుంది. వాళ్ళ గురించి పట్టించుకోకని లక్ష్మీ చెప్తుంది. లేదమ్మా పట్టించుకుంటానని గంగ అంటుంది. ఆ తర్వాత వీరు దగ్గరికి ఇషిక వచ్చి.. ఏదైనా చేస్తే సాక్ష్యం లేకుండా చెయ్యాలి.. ఆ గంగకి ఇప్పుడు అంతా తెలిసిపోయిందని ఇషిక అంటుంది. అదే ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని వీరు అంటాడు. గంగని ఈ ఇంటికి కోడలిని చెయ్యాలని ఇషిక అనగానే వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.