English | Telugu
`కామెడీ స్టార్స్` : యాంకర్ రవి పరువు తీసిన విశ్వ
Updated : Nov 18, 2021
బిగ్‌బాస్ తాజా సీజన్‌లో తను టైటిల్ రేస్‌లో వుండటానికి యాంకర్ రవి కొంత మందిని తన ఎత్తులతో చిత్తు చేస్తూ హౌస్ పుంచి బయటికి పంపించేస్తున్న విషయం తెలిసిందే. లహరి.. ప్రియ.. శ్వేతావర్మ.. ఆయంకర్ రవి కారణంగానే హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. రవి కారణంగా కొన్ని టాస్క్‌లలో అడ్డంగా దొరికిపోయిన లహరి, శ్వేతావర్మ, ప్రియ అదే కారణంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
దీంతో యాంకర్ రవి వ్యవహార శైలిపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బయటికి వచ్చిన విశ్వ కూడా యాంకర్ రవిపై ఫైర్ అయ్యాడు. ఏకంగా రవి పరువుతీసేశాడు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన వాళ్లలో చాలా మంది ఓంకార్ నిర్వహిస్తున్న కామెడీ షో `కామెడీ స్టార్స్` షోలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలోకి గత ఆదివారం లోబో ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేశాడు. యాంకర్ శివ అడిగిన ప్రశ్నలకు చిర్రెత్తుకోచ్చి షో నుంచి వెళ్లిపోవడం తెలిసిందే.
ఇదిలా వుంటే ఈ వారం కామెడీ స్టార్స్ షోలోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ విశ్వ పోలీస్ గెటప్‌తో ఎంట్రీ ఇస్తున్నాడు. విశ్వతో పాటు లోబో కూడా ఈ ఆదివారం కామెడీ స్టార్స్‌లో సందడి చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోని `స్టార్ మా` తాజాగా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో టార్చర్ చేస్తున్న విశ్వని ఉద్దేశించి `అమ్మతోడు` అని లోబో అనడం.. దానికి కౌంటర్‌గా ఆ డైలాగ్ బిగ్‌బాస్ హౌస్‌లో యాంకర్ రవిగానిది నీది కాదు అని విశ్వ అనడం.. దానికి శ్రీముఖి అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం నవ్వులు పూయిస్తోంది.