English | Telugu
షన్నును బయటకు పంపాలనుకుంటున్న ఎనిమిది మంది!
Updated : Oct 5, 2021
అప్పుడే ఐదో వారంలోకి 'బిగ్ బాస్' ఐదో సీజన్ అడుగుపెట్టింది. చూస్తుండగానే నాలుగు వారాలు గడిచిపోయాయి. నలుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఒక్క లహరి తప్పితే మిగతా వాళ్ళందరూ కోపధారి మనుషులుగా ముద్రపడిన వాళ్లే. ఇప్పుడు ఐదో వారంలో ఎవరు బయటకు వెళ్తారు అనే ఆసక్తి మొదలైంది.
సోమవారం ఐదో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో తొమ్మిది మంది నామినేట్ కావడం గమనార్హం. ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ ముగిసిన తర్వాత.... లోబో, జెస్సీ, షణ్ముఖ్, ప్రియ, సన్నీ, రవి, మానస్, విశ్వ, హమీద నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
ఇంటిలోని 15 మంది సభ్యుల్లో ఎనిమిది మంది షణ్ముఖ్ జస్వంత్‌ను నామినేట్ చేయడం గమనార్హం. రవి, జెస్సీలను నలుగురు నలుగురు నామినేట్ చేశారు. పైకి నెమ్మదస్తుడిగా కనిపిస్తున్న షణ్ముఖ్ పట్ల ఇంత మంది విముఖత చూపిస్తుండటం వెనుక కారణమేంటి? అనే చర్చ మొదలైంది. ఆడియెన్స్‌లో మాత్రం అతని మీద ఇంత విముఖత లేదనే చెప్పాలి.