English | Telugu

దుబాయ్ లోని ఎత్తైన బిల్డింగ్ నుండి దూకేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

ఆకాశం ఎత్తు నుండి ఒక్కసారిగా పడిపోతే కొందరి ప్రాణాలు గాల్లోనే పోతాయి. అంత భయమేస్తుంది. ఓ నలభై అడుగుల ఎత్తు అంటేనే వామ్మో అని కొందరు బయపడుతుంటారు. అలాంటిది 1300 ఫీట్ల ఎత్తు నుండి దూకేస్తే ఇంకెంత భయమేస్తుంది. కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ దామిని భట్ల ఆ సాహసాన్ని చేసింది. తన యూట్యూబ్ ఛానెల్ లో దీనికి సంబంధించిన వ్లాగ్ ని షేర్ చేసి, తన అనుభావాలని పంచుకుంది.

'లవ్ ఇన్ లండన్' సినిమాలోని ' నీ కోసం' పాటతో ప్రేమికులకు దగ్గరైన దామిణి. 'బహుబలి- ది బిగినింగ్' లో పచ్చ బొట్టేసిన పాటతో ఎంతోమందికి దగ్గరైంది. రాజమండ్రి దగ్గర తాడేపల్లి గూడెంలో జన్మించిన దామినికి కర్నాటక సంగీతం అంటే మక్కువతో అది నేర్చుకుంది. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమయిన ' సరిగమప' షోలో గాయకురాలిగా తన కెరీర్ ప్రారంభించింది. స్టేజి షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్, ప్రైవేట్ బ్యాండ్, సినిమాల్లో సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. కొండపొలం సినిమాలోని ధమ్ ధమ్ పాటకు బెస్ట్ లిరిక్స్ నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాట పాడింది దామినీనే.

బిగ్ బాస్ హౌస్ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చి తనకి నచ్చినట్టుగా ఉండటంతో తొందరగా బయటకొచ్చేసింది. అతిగా ఆవేశపడేవాళ్లు, అనవసరంగా వాదిస్తూ సాగదీసేవాళ్లు, తమ డప్పు తామే కొట్టుకునేవాళ్లు, కేవలం డైలాగులకే పరిమితమయ్యేవాళ్లు, వెనకాల గోతులు తవ్వేవాళ్లు, కిచెన్‌కే పరిమితమై ఆడటమే మర్చిపోయేవాళ్లు.. ఇలా ప్రతిసీజన్‌లోనూ ఇలాంటి వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఈ సీజన్‌లో అలాంటివారున్నారు. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా కిచెన్‌కే పరిమితమైనవాళ్లు మాత్రం హౌస్‌లో ఎక్కువ వారాలు ఉన్న దాఖలాలు లేవు. అందుకేనేమో దామిని త్వరగా బయటకొచ్చేసింది. ఇక తాజాగా తన మ్యూజిక్ ఆల్బమ్ వీడియోని రిలీజ్ చేసి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కాగా ఇప్పుడు దుబాయ్ లో అతిపెద్ద బిల్డింగ్ నుండి జంప్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. పదమూడు వందల ఎత్తు నుండి జంప్ చేసి ఆ అనుభవాలని తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. కొన్ని సార్లు లైఫ్ ని అద్భుతంగా మల్చుకోవడానికి కొన్ని డబ్బులు ఖర్చుపెట్టాలని, అవే మనకి మెమరీస్ గా ఉంటాయని.. లైఫ్ లో అందంతో పాటు కొంత రిస్క్ కూడా‌ తీసుకోవాలని దామిని చెప్పుకొచ్చింది. ‌కాగా ఈ వ్లాగ్ కి ఇప్పుడు అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.