English | Telugu
పెళ్లైన మరుసటి రోజే లేచిపోయిన అవినాష్ భార్య ?
Updated : Nov 16, 2021
జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్‌కు భారీ షాక్ తగిలింది. పెళ్లైన మొదటిరోజే భార్య తను నచ్చలేదని ప్రేమించిన వాడితో జంప్ అయింది. ఆగండాగండి.. ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్ స్కిట్‌లో.. వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాస్ సీజన్ 4లో ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకున్న అవినాష్ ఆ తరువాత నుంచి వరుస ఆఫర్లతో నిత్యం బిజీగా మారిపోయాడు. అంతే కాకుండా `స్టార్ మా`లో ఓంకార్ నిర్వహిస్తున్న పలు షోలలో ఎంట్రీ ఇచ్చి తనదైన మార్కు కామెడీతో ఆకట్టుకున్నాడు.
అంతే కాకుండా `కామెడీ స్టార్స్`లోనూ తనదైన కామెడీ స్కిట్‌లతో ఎంటర్‌టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కామెడీ స్టార్స్ షోకు ప్రముఖ కమెడియన్ అలీ, నటి శ్రీదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుండగా.. హోస్ట్‌గా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యవహరిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమోని విడుదల చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది.
ఇందులో ముక్కు అవినాష్ కొత్తగా పెళ్లైన యువకుడిగా కనిపించనున్నాడు. `పుష్పక విమానం` సినిమా కాన్సెప్ట్ నేపథ్యంలో ముక్కు అవినాష్ చేస్తున్న ఈ స్కిట్ కు సంబంధించిన తాజా ప్రోమో ఆకట్టుకుంటోంది.`ఏమండీ మీరు నాకు నచ్చలేదు. అందుకే పెళ్లైన మరుసటి రోజే ఇంకొకడితో ఎగిరిపోతున్నాను. మీతో నాకు వర్కవుట్ కాదు. నన్ను క్షమించండి.. ఈ విషయం ఎవరికైనా చెబితే సమాజం మీ ముఖంపై ఉమ్మేస్తుంది` అంటూ అవినాష్ లేచిపోయిన తన భార్య లెటర్ రాయడం.. ఆ విషయం బయటపడకుండా తన భార్య ఇంట్లోనే వున్నట్టుగా అవినాష్ కవర్ చేయడం... ఎవరు ఉమ్మేసినా పరవాలేదు తుడుచుకుంటానని అవినాష్ అంటుంటే శ్రీముఖి ఉమ్మేయడం నవ్వులు పూయిస్తోంది. లేచిపోయిన అవినాష్ పెళ్లాంగోల కథేంటో తెలుసుకోవాలంటే వచ్చే సండే వరకు వేచి చూడాల్సిందే.