English | Telugu
గుప్పెడంత మనసు : జోరు వానలో రిషి.. వసుధార
Updated : Nov 16, 2021
`స్టార్ మా`లో ప్రసారం అవుతున్న ధారావాహిక `గుప్పెడంత మనసు`. కన్నడ నటీనటులు ముఖేష్ గౌడ, అక్ష గౌడ, సాయికిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రసారం అవుతున్న `గుప్పెడంత మనసు` మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మంగళ వారం 293వ ఎపిసోడ్‌లోకి ఎంటరవుతోంది. ఈ సందర్భంగా పలు రసవత్తర సంఘటనలు చోటు చేసుకోనున్నాయి.
వసుధార, రిషిలుగా నటిస్తున్న ముఖేష్ గౌడ, అక్ష గౌడల మధ్య ఈ రోజు ఎపిసోడ్‌లో రసవత్తర మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. రిషిపై కోపంతో అతని కార్‌ని ఛేజ్ చేసి అడ్డుకున్న వసుధార ఏం చేసింది? .. రిషిని ఏ స్థాయిలో నిలదీసింది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తనని అడ్డగించిన వసుధార `మీరు అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటే అడిగే అడ్డగించే హక్కు నాకుంది` అంటూ నిలదీస్తుంది. యీరు సమాధానం చెప్పేవరకు ఇక్కడే వుంటనని భీష్మిస్తుంది.
నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే వసుధార మాత్రం అక్కడే వుంటుంది. వర్షం వచ్చేలా వుండటంతో వసుధార కోసం జగతి కంగారు పడుతూ వుంటుంది. కంగారుగా మహేంద్ర .. రిషికి కాల్ చేస్తే కట్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు రిషి. అయితే ధరణికి ఫోన్ చేసి వసుధార ఎక్కడ అని రిషిపై అరుస్తాడు మహేంద్ర. దీంతో వసు మాటలు గుర్తొచ్చి రిషి తన ఫోన్‌ని ధరణికి ఇచ్చేసి అక్కడి నుంచి వసుధారని వెతుక్కుంటూ వెళ్లిపోతాడు. వర్షంలో తడుస్తూ నిలుచున్న వసుధార ఏం చేసింది. రిషి ఎలా వసుధారని ఒప్పించాడు? .. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ చోటు చేసుకుంది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.