English | Telugu
అశ్విని శ్రీ ఎలిమినేషన్.. ఉల్టా పల్టా జరగనుందా?
Updated : Oct 15, 2023
బిగ్ బాస్ హౌస్ లో రోజు టాస్క్ లే కాకుండా, బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఈ షో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంటుంది. అయితే ఇప్పటికి ఐదు వారాల నుండి లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం కుడా మరో అమ్మాయి ఎలిమినేట్ అవనుందా అంటే అవుననే తెలుస్తుంది.
నామినేషన్లో ఉన్న కొత్త హౌజ్ మేట్స్ లో అశ్విని శ్రీ, పూజా మూర్తి, నయని పావని లీస్ట్ లో ఉన్నారు. అయితే ఈ వారం గేమ్ పరంగా నయని పావని బాగా ఆడింది. పూజా మూర్తి, అశ్విని శ్రీల మధ్య గొడవ ముదిరి అది హోస్ట్ నాగార్జున దగ్గరి దాకా రావడంతో మరింత ఇంట్రెస్ట్ గా మారింది. మరి ఈ ముగ్గురిలో హౌజ్ లో నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది. బిగ్ బాస్ హౌజ్ లోకి 2.0 లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో భోలే శావలి బాగా ఆడకపోయినా తనకి మ్యూజిక్ లవర్స్ సపోర్ట్ ఉంది. అలాగే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సపోర్ట్ ఉంది. ఎప్పుడు పల్లవి ప్రశాంత్, శివాజీలతో ఉండే భోలే శావలిని అందరు బయాజ్(పక్షపాతం) గా ఉంటున్నాడని అనుకుంటున్నారు. అయిన అతను మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలవాలని వచ్చానని చెప్పడంతో అతనకి మరింత ఓటింగ్ పెరిగింది. ఇక నిన్న మొన్నటి దాకా ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న శోభా శెట్టి కూడా తన ఆటతీరుతో మెరుగుపరుచుకుంది. హౌజ్ లో టేస్టీ తేజతో కలిసి టాస్క్ చేస్తూ ఓటింగ్ ని పెంచుకుంటుంది. ఇక పూజా మూర్తి రూడ్ బిహేవియర్ తో మరింత లీస్ట్ కి వెళ్ళింది.
పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావని.. ఈ ముగ్గురు ఒకే ఓటింగ్ శాతంతో లీస్ట్ లో ఉన్నారు. అయితే ఇరవై, ముప్పై ఓట్ల తేడాతో అశ్విని శ్రీ చివరి స్థానంలో, ఆ తర్వాత నయని పావని ఉంది. ఈ చివరి రోజు ఓటింగ్ లో అశ్విని శ్రీకి ఓటింగ్ తక్కువ పడితే తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నయని పావనికి తక్కువ ఓటింగ్ పడితే తనే ఎలిమినేషన్ అయ్యేలా ఉంది. ఇక ఇప్పుడు ఎలిమినేషన్ అనేది ఈ ఇద్దరిలో ఎవరనేది తెలియాల్సి ఉంది. కొత్త కంటెస్టెంట్స్ లలో ఎంతో కొంత తెలిసిన అమ్మాయి నయని పావని. తను ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ లు తక్కువ ఉన్నాయి. అయితే అశ్విని శ్రీకి కూడా ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది మరింత ఉత్కంఠభరితంగా మారింది.