English | Telugu
బిగ్ బాస్ ఎపిసోడ్-42 రివ్యూ!
Updated : Oct 15, 2023
బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ వారం కొత్త టాస్క్ లతో కంటెస్టెంట్స్ ని ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. ఉల్టా పల్టా థీమ్ తో కొత్త ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ షో. అయితే గ్రాంఢ్ లాంచ్ 2.0 తర్వాత సీరియల్ బ్యాచ్ బండారం బయటపడిందనే చెప్పాలి. నలుగురు కలిసి ఏది మాట్లాడుకోవాలన్నా కాస్త భయపడుతున్నారు.
శనివారం నాగార్జున ఎంట్రీ కూల్ గా ఉంది. మళ్లీ పాత నాగార్జున వచ్చాడు. ఈ వీకెండ్ అంత కిక్ అనిపించలేదు. కెప్టెన్ గా ప్రిన్స్ యావర్ అవ్వడం సీరియల్ గ్యాంగ్ తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు సీరియల్ గ్యాంగ్ ఇష్టం వచ్చినట్లు వండుకొని తిన్నారు. ఆ రోజు కిచెన్ లో జరిగిన గొడవ యావర్ మనసులో ఉండిపోయింది. ఇక కూల్ డ్రింక్ దొంగతనం చేసిన అమర్ దీప్ ని యావర్ పట్టుకొని.. అడగాలి కదా, అసలు వీఐపీ రూమ్ కి నీకు ప్రవేశం లేదు కదా అని అడుగగా.. ఒక్కటే తీసుకున్నా, గ్యాస్ట్రిక్ ఉందని అమర్ దీప్ అన్నాడు. ఇక ఈ ఇష్యూలో ఆట సందీప్ వచ్చి గొడవని పెద్దది చేశాడు. ఈ ఇష్యూతో సందీప్ మాస్టర్ మరింత నెగెటివ్ అయ్యాడు. నాగార్జున ఈ ఇష్యూ మీద డిస్కస్ చేసి సీరియల్ గ్యాంగ్ కి వాతలు పెట్టాడు. మన వంటలక్క ప్రియాంక జైన్ కిచెన్ లో ఆధిపత్యం లేకపోయేసరికి తనలో తనే కుమిలిపోతుంది. భోలే షావలి కిచెన్ లో వంటలతో అదరగొడుతుంటే ప్రియాంక జైన్ మొహం మాడ్చుకుంటుంది.
ఆట సందీప్ ప్రతీ వారం ఫెయిల్ అవ్వడంతో ప్రేక్షకుల దృష్టిలో నెగెటివ్ అవ్వడంతో ఈ సారి నామినేషన్లోకి వస్తే ఎలిమినేషన్ గ్యారంటీలా అనిపిస్తుంది. ఇక స్పాన్సర్ టాస్క్ లో హౌజ్ లోని ఆడవాళ్లు లిప్ స్టిక్ పెట్టుకొని ఒక టీ షర్ట్ కి కిస్ ఇచ్చారు. అలా ఎవరు చేశారో కనుక్కోమని హౌజ్ లోని మగవాళ్లని గెస్ చేయమనగా టేస్టీ తేజ కరెక్ట్ గా సమాధానం చెప్పాడు. ఇక శోభా శెట్టి, టేస్టీ తేజ కలిసి డేట్ కి వెళ్లారు. ఇక ఇదే ఊపులో శోభా శెట్టికి టేస్టీ తేజ లవ్ ప్రపోజ్ చేశాడు. ఇక డౌట్ రాకుండా చివరలో లవ్ యూ యాజ్ ఫ్రెండ్ అని చెప్పాడు టేస్టీ తేజ.
ఇక బ్రెయిన్ లెస్, యూజ్ లెస్, ఏమ్ లెస్ ఎవరనే ట్యాగ్ లు తీసుకొచ్చి, ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఇవ్వమన్నాడు నాగార్జున. భోలే షావలి వచ్చి బ్రెయిన్ లెస్ ట్యాగ్ ని అంబటి అర్జున్ కి ఇచ్చాడు. అశ్విని శ్రీకి బ్రెయిన్ లెస్ ట్యాగ్ ఇచ్చింది నయని పావని. గ్రూప్ టాస్క్ అన్నప్పుడు ఏది కరెక్ట్ చేయాలో అదే ఆలోచిస్తామని నయని పావని అశ్విని శ్రీని ఉద్దేశించి అనగా.. అదేం లేదు సర్. వాళ్ళు ముగ్గరు కలిసి డిస్కషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ స్ట్రాటజీ అనేది నాకు చెప్పట్లేదని అశ్విని శ్రీ అనగా.. ఏం స్ట్రాటజీ అనేది లేదు సర్.. నేను మాట్లాడేది తను తీసుకోవట్లేదు ఇకనుండి బుజ్జగిస్తూ చెప్తామని నయని పావని అంది. ఇక అమర్ దీప్ కి బ్రెయిన్ లెస్ ట్యాగ్ ఇచ్చాడు శివాజీ. కాసేపటికి హౌస్ లోకి దామిణి, రతిక రోజ్, శుభశ్రీ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎవరైతే హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందో డిసైడ్ అవ్వమని హౌస్ మేట్స్ కి చెప్పాడు నాగార్జున. ఈ ముగ్గురిలో హౌస్ లోకి ఎవరు వస్తారనే ఆసక్తి ఇప్పుడు అందరిలోను నెలకొంది.