English | Telugu

నయని పావని ఎలిమినేషన్.. మోస్ట్ హార్ట్ టచింగ్!

బిగ్ బాస్ హౌజ్ లో మోస్ట్ హార్ట్ టచింగ్ ఎపిసోడ్ గా ఆదివారం నాటి ఎపిసోడ్ మిగిలిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా ఆరో వారం నయని పావని ఎలిమినేషన్ అయింది. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని ఇప్పటికే చాలా ట్రోల్స్ వస్తున్నాయి.

ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఆరోవారం నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని వరుసా ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటు రాగా చివర్లో పూజా మూర్తి, నయని పావని, అశ్విని శ్రీ ఉన్నారు. ఇక ఆ తర్వాత పూజామూర్తి సేవ్ అయింది. చివరగా అశ్విని శ్రీ, నయని పావని ఇద్దరు నామినేషన్లో ఉన్నారు. ఆదివారం నాటి గెస్డ్ లని పిలిచేశాడు నాగార్జున. భగవత్ కీసరి మూవీ డైరెక్టర్ అనిల్ రావిపుడి, హీరోయిన్ శ్రీలీల గెస్ట్ లు వచ్చారు. ఇక హౌజ్ లోని ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్తూ వారికి గైడెన్స్ ఇచ్చాడు అనిల్ రావిపుడి. కంటెస్టెంట్స్ తో ఆటలు ఆడి పాడించాడు.


ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఫిల్ చేస్తూ ఆట ఆడించాడు నాగార్జున. అందులో టీమ్ - B గెలిచింది. దాంతో లగ్జరీ బడ్జట్ వారికే దక్కింది. ఆ తర్వాత గెస్ట్ లని పంపించి, నామినేషన్లో ఇన్న నయని, అశ్విని ఇద్దరిని యాక్టివిటి ఏరియాకి రమ్మని.. అక్కడ ఉన్న గాజు బీకర్లో బాటిల్ లో ఉన్న వాటర్ ని పోయమన్నాడు. నయని పావని గాజు బీకర్ లోని వాటర్ రెడ్ కలర్ లోకి మారాయి. అశ్వినివి ఎల్లో రంగులోకి మారాయి. దాంతో అశ్విని సేఫ్, నయని యూ ఆర్ నాట్ సేఫ్ అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత హౌజ్ మేట్స్ అందరికు గుడ్ బై చెప్పేసి వచ్చేసింది.