English | Telugu
కొడుకు కోడలి శోభనానికి ఏర్పాట్లు చేశాడు.. వారసురాలు కావాలంట!
Updated : Oct 29, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ‘గుప్పెడంత మనసు’. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -906 లో.. అనుపమ అనేసిన మాటలని గుర్తుకుచేసుకుంటాడు మహేంద్ర. అప్పుడే మహేంద్ర దగ్గరికి వసుధార వస్తుంది. డిన్నర్ చేశారా అని వసుధారని మహేంద్ర అడుగుతాడు. చేసాం కానీ మేరే చెయ్యలేదని వసుధార అనగానే.. నాకు ఫ్రెండ్ కలిస్తే తనతో కలిసి రెస్టారెంట్ కీ వెళ్లి డిన్నర్ చేశానని మహేంద్ర చెప్తాడు. అలా తను చెప్పగానే ఎవరు ఆ ఫ్రెండ్ అని వసుధార అడుగుతుంది. టైమ్ వచ్చినప్పుడు చెప్తానని మహేంద్ర అంటాడు. అప్పుడే వసుధారకి ఫోన్ రావడంతో బయటకు వచ్చేస్తుంది.
ఆ తర్వాత వసుధారకి ఫోన్ చేసింది ఎవరో కాదో శైలేంద్ర.. అరకులో నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారా అని శైలేంద్ర అంటాడు. నాకెలా తెలుసు అనుకుంటున్నావా నువ్వే చెప్పావని శైలేంద్ర అంటాడు. అవును నేనే చెప్పాను. నాకు తెలుసు ధరణి మేడమ్ ఫోన్ నుండి మెసేజ్ చేసింది మేరేనని అని, మేం అరకులో ఉన్నామని ధరణి మేడమ్ కి ముందే తెలుసు. అయిన మళ్ళీ మెసేజ్ లో ఎక్కడ ఉన్నారని ఎలా అడుగుతుందని శైలేంద్రకి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది వసుధార. ఆ తర్వాత శైలేంద్రకి వసుధార కౌంటర్ వేస్తు.. తన స్టైల్ లో మాస్ వార్నింగ్ కూడా ఇస్తుంది. మరొకవైపు శైలేంద్రకి ధరణి కాఫీ తీసుకొని వస్తుంది. నీకు వసుధార వాళ్ళు అరకు లో ఉన్నారని ముందే తెలుసా అని ధరణిని అడుగుతాడు శైలేంద్ర. తెలుసని ధరణి అని చెప్పగానే.. తెలిసి నన్ను వెర్రి వాన్ని చేసారా అని అంటాడు. నిజమైన నటులు అంటే మీరే అని ధరణితో శైలేంద్ర అంటాడు. మరొక వైపు రిషి తనపై జరిగిన ఎటాక్ గురించి ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో దేవయాని, శైలేంద్ర ఇద్దరు కలిసి ఫణింద్ర తో మాట్లాడుతారు. మహేంద్ర నిన్ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వెళ్లి ఇన్ని రోజులు అవుతుంది. ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడడం లేదని దేవయాని అనగానే.. అలా అని ఎవరన్నారు. మహేంద్ర, రిషి డైలీ ఫోన్ చేసి మాట్లాడుతున్నారని ఫణింద్ర అనగానే.. దేవయాని శైలేంద్ర లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అప్పుడే ఫణింద్రకు రిషి ఫోన్ చేస్తాడు. చూసారా రిషి ఫోన్ చేసాడంటూ ఫణింద్ర పక్కకి వెళ్తాడు. ఏంటి రిషి మనల్ని పక్కన పెట్టాడా అని దేవయాని అంటుంది. ఇప్పుడు వాళ్ళ గురించి ప్లాన్ లు ఏం వెయ్యాకు మన మీద డౌట్స్ వస్తుందని దేవాయని చెప్తుంది.
మరొక వైపు రిషి, వసుధారలని మహేంద్ర ఎంజాయ్ చెయ్యడానికి బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత రిషి వసుధారలు బయటకు వెళ్తారు. వాళ్ళు వెళ్ళాక మహేంద్ర వాళ్ల ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లు చేస్తాడు. నాకు ఒకటే ఆశ.. నా జగతి మళ్ళీ రిషి వసుధారల బిడ్డగా పుట్టాలని మహేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.