English | Telugu
కూతురి కోసం జైలుకి వెళ్ళిన ప్రభాకర్!
Updated : Oct 29, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ‘కృష్ణ ముకుంద మురారి’. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -300 లో.. భవాని పిలవగానే పోలీసులు వచ్చి కృష్ణని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలని అనుకుంటారు. అప్పుడే ప్రభాకర్ వచ్చి ఆగండి అని చెప్తాడు. ఇప్పటివరకు భవాని అక్క చెప్పింది నిజమే అని చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు.. అవును ఇదంతా చేసింది నేనే అంటాడు.
ఆ తర్వాత నా కూతురు నీ ఇంట్లో నుండి పంపించేసారన్న కోపంతో నేనే ఈ పని చేసాను. కానీ, ఇదంతా నా కూతురికి గాని, నా భార్యకి గాని తెలియదని పోలీసులకి ప్రభాకర్ చెప్తాడు. కృష్ణ మాత్రం చిన్నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నావని అడుగుతుంది. నా కూతురు ఆ ఇంటి కోడలు. తనని ఇంట్లో నుండి గెంటేసారని పోలీసులతో ప్రభాకర్ చెప్తాడు.. లేదు భవానిగారి కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళు అలా చెయ్యరని భవానిని ఆ ఇన్‌స్పెక్టర్ అడుగుతాడు. అది అబద్ధమని భవాని చెప్తుంది. నా కూతురు మాత్రం ఆ ఇంట్లో నే ఉండాలని పోలీసులకి ప్రభాకర్ చెప్తాడు.. దానికి పోలీసులు సరేనంటారు. ఆ తర్వాత పోలీసులు ప్రభాకర్‌ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే.. కృష్ణ వెళ్లి ఎందుకు ఇదంతా చేస్తున్నావ్ చిన్నాన్న అని అడుగుతుంది. నీకు అల్లుడు అంటే ఇష్టం. నువ్వు ఇప్పుడు అక్కడే ఉండాలి. నువ్వు అక్కడ ఉండాలంటే నేను లోపల ఉండాలని ప్రభాకర్ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు ముకుంద తన అన్నయ్యని కలవడానికి స్టేషన్‌కి వెళ్తుంది. హాస్పిటల్‌లో జరిగింది మొత్తం అతనికి చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకని ముకుందకి తన అన్నయ్య చెప్పి పంపిస్తాడు.
మరొకవైపు హాస్పిటల్ నుండి మురారిని తీసుకొని ఇంటికి వస్తారు. మురారికి ముకుంద హారతి ఇస్తుంది. మరొక వైపు కృష్ణ శకుంతలని తన ఇంటికి పంపించి.. కృష్ణ మురారి దగ్గరికి వస్తుంది. మరొక వైపు మురారికి భవాని ఇంట్లో అందరిని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్ వచ్చి మురారిని చెక్ చేస్తుంది. ఇతనికి గతం గుర్తుకు చేసే ప్రయత్నం చేస్తే ఇతని ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మరొక వైపు భవాని ఇంటికి కృష్ణ వస్తుంది. తనని చూసిన ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.