English | Telugu

డాక్టర్‌ని నిలదీసిన అత్త.. తప్పుని కోడలి మీదకి తోసేసిందిగా!

స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్‌ ‘బ్రహ్మముడి’. ఈ సీరియల్‌ శనివారం నాటి ఎపిసోడ్‌ -239 లో.. స్వప్న తాగిన జ్యూస్‌లో ట్యాబ్లెట్‌ కలిపి రాహుల్‌ ఇస్తాడు. ఆ తర్వాత ఆ జ్యూస్‌ తాగిన స్వప్న హాయిగా పడుకొని ఉంటుంది. ఏంటి ఏం రియాక్షన్‌ లేదని రాహుల్‌ స్వప్నని లేపి ఏమైనా అనిపిస్తుందా అని అడిగేసరికి స్వప్న చిరాకు పడుతుంది.

మరొకవైపు స్వప్న నుండి ఎలాంటి రియాక్షన్‌ లేదని వాళ్ళ రూమ్‌ డోర్‌ దగ్గర రుద్రాణి నిల్చొని వింటు ఉంటుంది. అప్పుడే కనకం వచ్చి రుద్రాణి అలా వినడం చూసి ఇదేం పాడుబుద్ది అంటూ కోప్పడుతుంది. అదేం లేదు నైట్‌ వాళ్ళు గొడవ పెట్టుకున్నట్లు అనిపించింది. అందుకే మళ్ళీ గొడవ పడుతున్నారా అని వింటున్నానని రుద్రాణి కవర్‌ చేసిన కనకం నమ్మదు. ఆ తర్వాత రుద్రాణిని కనకం లాక్కొని వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం కావ్య తల స్నానం చేసి వస్తుంది. ఆ తర్వాత పడుకొని ఉన్న రాజ్‌ దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకుంటుంది. అప్పుడే రాజ్‌ లేవడం చూసి త్వరగా దూరంగా వెళ్లి తల తూడ్చుకుంటుంది. రాజ్‌ లో తన అంతరామ్మ కావ్యని పట్టుకొబోతుంటే రాజ్‌ అపబోయే కావ్యని వెనకాల నుండి హగ్‌ చేసుకుంటాడు. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. దాన్యలక్ష్మిని చూసిన రాజ్‌ ఇబ్బందిగా ఫీల్‌ అవుతాడు. మరొక వైపు స్వప్న, రాహుల్‌ ఇంకా బయటకు రావడం లేదని రుద్రాణి అనుకుంటుంది. అప్పుడే రాహుల్‌ బయటకు వచ్చి మన ప్లాన్‌ ఫెయిల్‌ అయింది. స్వప్న జ్యూస్‌ తాగి నిద్ర పోయిందని రాహుల్‌ అనగానే.. అసలు ఆ డాక్టర్‌ ఏం టాబ్లెట్‌ ఇచ్చిందో అడగాలని రుద్రాణి అనుకుంటుంది. మరొక వైపు కావ్య కాఫీ తీసుకొని వచ్చి.. రాజ్‌కి ఒక డ్రెస్‌ ఇస్తుంది. ఫంక్షన్‌లో మనమిద్దరిది మ్యాచింగ్‌ ఉండాలని రాజ్‌కి చెప్తుంది కావ్య.

మరొక వైపు డాక్టర్‌కి రుద్రాణి ఫోన్‌ చేసి.. నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్‌ పనిచెయ్యడం లేదని అడుగుతుంది.. మీరు వేరే ట్యాబ్లెట్స్‌ అయిన తీసుకొని వెళ్ళాలి లేదంటే మీరు చెప్పిన అమ్మాయి ప్రెగ్నెంట్‌ కాదైనా అయి ఉండాలని రుద్రాణితో డాక్టర్‌ చెప్తుంది. దీంతో రుద్రాణికి డౌట్‌ వస్తుంది. స్వప్న ప్రెగ్నెంట్‌ అవునో కాదో తెలుసుకోవాలని రుద్రాణి అనుకుంటుంది.. మరొక వైపు కృష్ణ మూర్తి, కనకం స్వప్న శ్రీమంతానికి వస్తారు. ఆ తర్వాత రాజ్‌కి అపర్ణ డ్రెస్‌ ఇచ్చి ఇది వేసుకోమని చెప్తుంది. ఆ తర్వాత రుద్రాణికి అపర్ణ ఒక పని అప్పజెప్పుతే తను మర్చిపోయి కావ్య మీద నెట్టివేస్తుంది. నాకు మీరేం పని చెప్పలేదని రుద్రాణితో కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్‌ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.