English | Telugu
నేను తన లెవెల్ కాదంటోన్న అర్జున్!
Updated : Oct 22, 2022
బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుంచి మంచి స్నేహితులు కాస్త శత్రువులు గా మారారు. రేవంత్ తో అర్జున్ రూడ్ గా మాట్లాడేలా చేసింది శ్రీసత్యనే అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పటికే అర్జున్ కన్ఫ్యూషన్ కంటెస్టెంట్ గా ముద్ర వేసుకోగా, నిన్న జరిగిన టాస్క్ తో మరోసారి ప్రేక్షకులకు స్పష్టంగా తెలిసిపోయింది.
టాస్క్ లో ఒక చిన్న పాటి యుద్ధమే జరిగిందని చెప్పాలి. అర్జున్ కి, రేవంత్ కి మాట మాట పెరిగి పెద్ద గొడవలా మారింది. అసలు ఏం జరిగిందంటే టాస్క్ లో అర్జున్, రేవంత్ ని అడ్డుకున్నాడని అనగా, "అది గేమ్ లో పార్ట్ అంతే " అని రేవంత్ చెప్పుకొచ్చాడు. ఆ విషయం తెలియక కన్ఫూషన్ లో అర్జున్ ఒకే విధంగా ఆలోచిస్తూ తనని అడ్డుకున్నాడని గొడవకు దిగాడు. అంతకముందే జరిగిన రేవంత్, అర్జున్ ల మధ్య గొడవ తెలిసిందే. అది కాస్త రాను రాను ముదిరింది. అర్జున్ రేవంత్ కి డిజాస్టర్ బ్యాడ్డ్ ఇచ్చి కారణం చెప్పాడు. "నువ్వు టాస్క్ లో మాట్లాడిన పద్ధతి ఏం బాగోలేదు. గేమ్ లోకి వచ్చేసరికి కూల్ నెస్ ని కోల్పోతున్నావ్" అని చెప్పగా, "నువ్వు ఏంటి నాకు చెప్పేది" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ, " నా గేమ్ ఇలానే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు చేస్తాను అని ఎలా అనుకుంటున్నావ్. ఏదో మాట్లాడాలని మాట్లాడతున్నావ్ అని నాకు అర్థం అయింది. సర్లే చెప్పేసావ్ గా వెళ్ళు" అని రేవంత్ అన్నాడు. ఆ తర్వాత అర్జున్ మాట్లాడుతూ, "ఒక వ్యక్తి మాట్లాడుతుంటే,అతని గురించి వెక్కిరిస్తు మాట్లాడం టోటల్ గా అన్ ఫార్మల్ గా మాట్లాడడం బాగోలేదు" అని అర్జున్ చెప్పాడు.
టాస్క్ జరుగుతున్నంత సేపు రేవంత్ కి ఒకరితో కాకున్నా, మరొకరితో గొడవ జరుగుతూనే వచ్చింది. కాగా రేవంత్ టాస్క్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. "నీ అగ్రెసివ్ బిహేవియర్ వల్ల నీ పర్ఫామెన్స్ మైనస్ అవుతోంది" అని అర్జున్ చెప్పాడు. ఆ తర్వాత అర్జున్, వసంతి దగ్గర కు వెళ్ళి చెప్పుకున్నాడు.
"తన బిహేవియర్ అలానే ఉంటుంది. ఏం మాట్లాడతాడో అర్థం కావట్లేదు. టాప్-5 కంటెస్టెంట్స్ అని అతను అనుకున్న వాళ్ళతోనే మాట్లాడుతాడు. నేను అతని లెవెల్ కాదు కదా" అని అర్జున్, వసంతితో అన్నాడు.