English | Telugu

నీళ్ల అడుగున డాన్స్ ఇండియా డాన్స్ హుక్ స్టెప్ వేసిన హోస్ట్!


జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రీమియం రియాలిటీ షో ''డాన్స్ ఇండియా డాన్స్'' ప్రేక్షకులను ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ షోకి స్టార్టింగ్ లో మహేష్ బాబు తన కుమార్తె సితారతో కలిసి ఎంట్రీ ఇచ్చారు. ఈ షో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. తెలుగు ఆడియన్స్ ని అలరించడమే కాదు డాన్సర్స్ తమ ప్రతిభను ప్రదర్శించడానికి , ఈ షో ద్వారా మరిన్ని అవకాశాలు రావడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతుంది.

ఇక డాన్స్ ఇండియా డాన్స్ డాన్స్ షో మొదలైన దగ్గర నుంచి దూసుకుపోతోంది. ఈ షోకి అకుల్ బాలాజీ హోస్ట్ గా రౌడీ రోహిణి కో-హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఈ షోకి సంగీత, బాబా భాస్కర్ , ఆనంది జడ్జెస్ గా ఉన్నారు. ఇక ఈ షో టైటిల్ సాంగ్ కి ఒక హుక్ స్టెప్ ఉంది . ఈ స్టెప్ బాగా ఫేమస్ అయ్యింది.

ఐతే హోస్ట్ ఆకుల బాలాజీ ఈ స్టెప్ ని నీటి అడుగున వేసి ఒక రికార్డు క్రియేట్ చేసాడు. మాల్దీవ్స్ కి వెళ్లిన అకుల్ అక్కడ నీళ్ల అడుగున స్కూబా డైవింగ్ చేస్తూ ఈ డాన్స్ ఇండియా డాన్స్ హుక్ స్టెప్ వేసి అందరినీ మెస్మోరైజ్ చేసేసాడు. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. పోస్ట్ చేసిన ఒక గంటలోనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ వీడియో.