English | Telugu
నేను ఫ్రీ.. నా మనసు ఎవరైనా దోచుకోవచ్చు!
Updated : Oct 22, 2022
లేడీ కమెడియన్ రోహిణి ఇటీవల బుల్లితెర మీద పేరు తెచ్చుకుంటున్న ఆర్టిస్ట్. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చాక ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తోంది. అలాగే డాన్స్ ఇండియా డాన్స్ షోకి కో-యాంకర్ గా చేస్తోంది. రోహిణి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు రోహిణి కూడా బూతులు వదులుతోంది.
ఈ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ లో బూతు కామెడీ ఎక్కువయ్యింది మహిళల్ని కించపరిచే డైలాగ్స్ ఎక్కువగా హైపర్ ఆది వేస్తుంటాడని విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. సొసైటీలో జరిగే కొన్ని అనర్థాలకు వీళ్ళ బూతు డైలాగులు కూడా కారణమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక రీసెంట్ గా ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో టీం లీడర్ రోహిణి డైలాగ్స్ వింటే బాబోయ్ అనిపిస్తుంది. ఐతే ఈ స్కిట్ లో 'ఆహ్వానం'మూవీలో విడాకులు సీన్ ని స్పూఫ్ గా చేసి చూపించారు. ఈ స్కిట్ లో బాబు, రోహిణి భార్యాభర్తలుగా చేశారు.
విడాకుల ఫంక్షన్ కి రోహిణి.. కృష్ణ భగవాన్ ని ఇన్వైట్ చేసి "ఇప్పుడు చెప్తున్నా.. ఈ విడాకుల తర్వాత నేను ఫ్రీ.. నా మనసెవరైనా దోచుకోవచ్చు" అనేసరికి, "ఇంతకీ నీ అడ్రెస్ ఎక్కడో చెప్పలేదు" అని ఆయన కౌంటర్ వేశారు. ఈ స్కిట్ పూర్తయ్యాక రోహిణిని కోవై సరళతో పోల్చారు కృష్ణ భగవాన్. "ఆవిడలా టైమింగ్ ఉన్న కామెడీ చేస్తున్నారు" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేసారు.