English | Telugu
అర్జున్, శ్రీసత్య మధ్య ఏం జరుగుతోంది?
Updated : Sep 23, 2022
బిగ్ బాస్ ప్రతీ సీజన్లో విడివిడిగా వచ్చినవారు కలిసిపోవడం, కలిసి వచ్చినవాళ్ళు గొడవలు పడటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాక రిలేషన్స్ లో ఉండటం, ఒకరి మీద ఒకరికి ఫీలింగ్ ఏర్పడటం కామన్. అయితే ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకునేది మాత్రం 'సీక్రెట్ లవ్ స్టోరీ'. అయితే ఈ సారి సీక్రెట్ లవర్స్ గా 'అర్జున్, శ్రీసత్య ఉన్నారేమో' అన్నట్లుగా కొందరు కంటెస్టెంట్స్ గుసగుసలాడుకుంటున్నారు.
'అడవిలో ఆట' టాస్క్ పూర్తి అయ్యిన తర్వాత కంటెస్టెంట్స్ ఇద్దరు, ఇద్దరుగా మాట్లాడుకుంటున్నారు. "శ్రీసత్యకి, అర్జున్ కి మధ్య ఏంటి" అని శ్రీహాన్ ని అడిగింది నేహ. "శ్రీసత్య అంటే కేర్ చూపించడం. ఎటు వెళ్ళినా ఫాలో అవ్వడం. కావాలని మాట్లాడటం. శ్రీసత్య మాత్రం అర్జున్ ని 'నిన్ను బ్రదర్' అని పిలవాలా అని ఆటపట్టిస్తుంటే, అర్జున్ అమాయకంగా చూస్తూ 'నీకు నచ్చినట్టు నన్ను పిలువు' అని అనడం.. ఇదంతా చూస్తుంటే నాక్కూడా అర్జున్ కి, శ్రీసత్య మీద ఫీలింగ్ ఉందేమోననిపించింది" అని శ్రీహాన్ చెప్పుకొచ్చాడు.
హౌస్‌లో'ఇంట్రావర్ట్' గా కనిపించే అర్జున్ కి నిజంగానే శ్రీసత్య మీద ఫీలింగ్ ఉందా?..ఉంటే తర్వాత వారంలోనైనా తన ఫీలింగ్ శ్రీసత్యతో చెప్తాడా లేదా అని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.