English | Telugu
'హౌస్‌లో ఉన్న అందరికంటే నేనే తోపు' అంటున్న గీతు!
Updated : Sep 23, 2022
బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకి ఊహాగానాలు మారిపోతున్నాయి. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈసారి సరికొత్త టాస్క్ లతో సరదా సరదాగానూ, ఉత్కంఠభరితంగానూ సాగుతోంది. ఇలా సాగడానికి కారణం షానీ, అభినయశ్రీ ఎలిమినేట్ అవ్వడం. గతవారం డబుల్ ఎలిమినేషన్ కారణం ఐతే.. ఈ వారం నామినేషన్లో గీతు, రేవంత్, శ్రీహాన్, చంటి, అదిత్య, వాసంతి, ఇనయా, ఆరోహీ ఉండటం వల్ల ఎలిమినేషన్ ప్రక్రియ కీలకంగా మారింది.
'టాస్క్ మొదలవ్వగానే మీరందరూ నేను ఓడిపోవాలని ఆడారు అంట కదా.. తెలిసింది' అని రేవంత్ ని అడిగింది గీతు. దానికి రేవంత్ 'నేను ఒక్కడినే అలా అనలేదు, నా తోటి ఉన్నవాళ్ళు అందరూ అన్నారు' అని సమాధానమిచ్చాడు. 'మీరందరూ నేను గెలవకూడదు అనుకుంటున్నారంటే నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని, అయితే మీ అందరికంటే నేనే తోపు అన్నమాట' అని రేవంత్‌తోగొప్పగా చెప్పుకొచ్చింది గీతు. తర్వాత 'టాస్క్ తో మంచి కనెక్షన్స్ పెరిగాయి' అని శ్రీహాన్ తో అంది.
"గీతు, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్ ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నారు" అని బిగ్ బాస్ చెప్పాడు. మొదటి రౌండ్ ముగిసేసరికి విజేతలుగా ఆదిరెడ్డి, శ్రీసత్య, శ్రీహాన్ ఉన్నారు. 'వీరు ముగ్గురు సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అయ్యారు. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తారో రేపు జరిగే కెప్టెన్సీ టాస్క్ లో తెలుస్తుంది' అని బిగ్ బాస్ ముగించేసాడు. ఇలా పద్దెనిమిదవ రోజు ఉత్కంఠభరితంగా కొనసాగింది.