Read more!

English | Telugu

Brahmamudi : ఓ నైట్ కి వస్తే జాబ్ వస్తుంది.. వాళ్ళ మాటలు సీక్రెట్ గా విన్న కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -370 లో.. బాబు మీ కాళ్ళపై పడుకోపెట్టి స్నానం చేయించండని రాజ్ కు కావ్య చెప్తుంది. రాజ్ ఇబ్బందిపడుతుంటే నేను చేపిస్తానని కావ్య బాబుకి స్నానం చేపిస్తుంది. మరొకవైపు ప్రకాష్ కు ఆఫీస్ నుండి ఒకతను కాల్ చేసి.. ఈ కాంట్రాక్టు ఆగిపోయింది. దీని వాళ్ళ కోటి రూపాయల లాస్ వచ్చింది.. రాజ్ చూసుకుంటాడని అనుకున్నా కానీ చూడలేదని ప్రకాష్ కి చెప్తాడు. సరే రాజ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందని ఎవరికి చెప్పకండని అతనితో  ప్రకాష్ ఫోన్ లో అంటాడు. వాళ్ళ మాటలన్ని అనామిక, రుద్రాణి వింటారు.

ఆ తర్వాత వాళ్ళు వెళ్లి ధాన్యలక్ష్మికి చెప్తారు. మరోకవైపు ఆ కాంట్రాక్టు కాన్సల్ అయిందట ఎందుకని ప్రకాష్ ని సుభాష్ అడుగుతాడు. నేను చూసుకుంటాను అన్నయ్య అని ప్రకాష్ అనగానే.. ఎందుకు నిజం దాస్తున్నారంటూ అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. ఏం నిజమని సుభాష్ అడుగుతాడు. నువ్వు లోపలకి వెళ్ళు అంటు ధాన్యలక్ష్మిపై ప్రకాష్ కోప్పడతాడు. అయిన ధాన్యలక్ష్మి వినకుండా.. కాంట్రాక్టు కాన్సిల్ అవడం వల్ల కోటి రూపాయలు నష్టం వచ్చింది.. దానికి కారణం రాజ్ అని అనగానే అందరు షాక్ అవుతారు. మా ఆయన వల్ల యాభై లక్షలు లాస్ వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు మీ కొడుకు వల్ల లాస్ వచ్చింది. ఇప్పుడు ఏమంటారని అపర్ణని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నేను తప్పు చేస్తే మా అమ్మ ఎందుకు సమాధానం చెప్పాలని రాజ్ అంటాడు. ఆఫీస్ విషయాలు ఇంట్లో ఎందుకని ఆ రోజు నుండి పట్టించుకోవడం మానేసాను. ఇప్పుడు నీకు సమాధానం కూడా నేను చెప్పను.. నువు ఎంత అరుచుకుంటావో అరుచుకో అని ధాన్యలక్ష్మితో అపర్ణ అంటుంది. కానీ కోటి రూపాయలు నష్టం అని అనామిక అంటుంది. నువ్వు ఏమైనా తెచ్చావా? నీ వాళ్ళు ఇచ్చారా? ఇంకొక మాట మాట్లాడితే పనిమనిషిని మానేసి ఇంట్లో పని మొత్తం నీతో చేయిస్తానంటు అనామికకి అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నష్టం వచ్చింది మళ్ళీ లాభం తెస్తాను కానీ ఇంట్లో రోజు రోజుకి మనుషుల మధ్య దూరం వస్తుంది. ఇది లాభమా నష్టమా అని రాజ్ అంటాడు. ఇక నుండి అందరు కలిసి మెలిసి మనస్పర్ధలు లేకుండా ఉండండి అని రాజ్ అనగానే.. అన్ని బానే చెప్తున్నావ్.. నువ్వు చేసిందేంటి పరువు తీసావ్ అంటూ రాజ్ తో అపర్ణ అంటుంది.

మరొకవైపు పోలీస్ కి సంబంధించిన అన్ని టెస్ట్ లలో అప్పు పాస్ అవుతుంది. చివరగా ఇంటర్వ్యూ ఒకటి ఉందని అప్పుతో ఆఫీసర్ చెప్తాడు. బయటకు వచ్చాక ఓ బ్రోకర్ కలుస్తాడు. ఒక నైట్ వస్తే నీకు జాబ్ వస్తుందంటు ఆ బ్రోకర్ అనగానే.. అతనికి అప్పు తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు బాబుని తీసుకొని రాజ్ ఆఫీస్ కి బయలుదేర్తాడు. నువ్వు కూడా రావాలని కావ్యకి రాజ్ చెప్తాడు. తరువాయి భాగంలో రాజ్, శ్వేత ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే కావ్య విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.