English | Telugu

దుగ్గిరాల కుటుంబం నుండి తనని వెలివేయమన్న అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -202 లో.. రుద్రాణి చెప్పుడు మాటలు విన్న అపర్ణ.. తను వద్దని చెప్పినా కూడా పని మనిషికి డబ్బులు ఇస్తుంది కావ్య అని కోపంగా ఉంటుంది. ఆ తర్వాత పనిమనిషికి కావ్య డబ్బులు ఇస్తుంటే అగమని అపర్ణ చెప్తుంది.. అలా కోపంగా గట్టిగా అరిచేసరికి ఇంట్లో అందరూ హాల్లోకి వస్తారు.

ఆ తర్వాత నేను ఏం చేశాను డబ్బులు అవసరం ఉందంటే ఇస్తున్నాను, అది కూడా తప్పేనా అని కావ్య అనగానే.. ఇవ్వడం తప్పు కాదు, నన్ను అడిగితే నేను ఇవ్వలేదు. నన్ను కాదని నువ్వు ఇవ్వడం తప్పని కావ్యపై అపర్ణ విరుచుకుపడుతుంది. అలా అసలు విషయం తెలుసుకోకుండా ఎందుకు ఇచ్చావ్ కావ్య అని ఇందిరాదేవి కూడా కావ్యనే అంటుంది. నా మాటకి విలువ లేకుండా చేస్తుందంటూ కావ్యపై ఇష్టం వచ్చినట్లు తన కోపాన్ని మొత్తం ప్రదర్శిస్తుంది అపర్ణ.. అసలు నాకు అత్తయ్య గారు ఇవ్వను అన్న విషయం తెలియదని కావ్య సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అపర్ణ వినిపించుకోదు. మరొక వైపు రుద్రాణి అపర్ణ నీ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత నువ్వు ఫస్ట్ రుద్రాణి మాటలు వినడం మానేయమని అపర్ణకి సుభాష్ చెప్తాడు. అసలు విషయం చెప్పాలని పనిమనిషి ట్రై చేసిన రుద్రాణి చెప్పకుండా అపి, నీకు కావలిసింది డబ్బు కదా తీసుకోమని రుద్రాణి అనగానే నాకు వద్దని పనిమనిషి అంటుంది. నీకు అవసరం కదా తీసుకొని వెళ్ళమని కావ్య అనగానే.. చూసారా ఇప్పుడు కూడా ఎంత ధైర్యంగా చెప్తుందని అపర్ణ అంటుంది. నా కొడుకు డబ్బుని నువ్వు ఎలా ఇస్తావ్ అని అపర్ణ అనగానే.. అది నా భర్త డబ్బు, వాడుకునే అధికారం నాకు ఉందని కావ్య అంటుంది. ఈ ఇంటికి మీరు ఎలాగో నేను అలాగే అని కావ్య అనగానే అపర్ణకి కోపం వస్తుంది.

ఆ తర్వాత నువ్వు ఎంత నీ బతుకెంత అని కావ్యని అపర్ణ కొడుతుంటే రాజ్ వచ్చి అపర్ణని ఆపుతాడు. నువ్వు చేస్తుంది తప్పు మమ్మీ ఒక ఆడపిల్లని కొట్టడం మన ఇంటి సంస్కారం కాదని చెప్తాడు. అసలు కావ్య ఏం తప్పు చేసింది. అలా సాయం చెయ్యడంలో తప్పేముంది. ఆ డబ్బులు కూడా కావ్య నన్ను అడిగే ఇచ్చిందని రాజ్ అనగానే అపర్ణ షాక్ అవుతుంది. కావ్య పైకి చెయ్యి ఎత్తడం తప్పు.. ఇంటి కోడలికి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని ఇందిరాదేవి అంటుంది. ఇలా అందరూ అపర్ణదే తప్పని అనడంతో అపర్ణ ఏడుస్తూ అందరిని క్షమాపణ అడుగుతున్నాను, ఇప్పుడు అందరు నన్ను ఒంటరి చేశారు. నా తప్పుకి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఈ రోజు నుండి దుగ్గిరాల కుటుంబం నుండి నన్ను వెలివేయండని అపర్ణ కోపంగా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.