English | Telugu

అన్ స్టాపబుల్ పల్లవి ప్రశాంత్.. రైతు బిడ్డకు సెలబ్రిటీల మద్దతు!

బిగ్ బాస్ సీజన్-7 గత వారం నుండి కాంట్రావర్సికి కేరాఫ్ గా మారింది. దానికి కారణం లేకపోలేదు. పల్లవి ప్రశాంత్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన హౌజ్ లోని మిగతా కంటెస్టెంట్స్ అందరు అతన్ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కాగా నామినేషన్ లో అందరు వరుసగా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి వారికి తెలియకుండానే అతడిని మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని చేసేసారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. అయితే అతను సింపథీ కోసమే అలా ప్రతిసారీ హౌజ్ లో రైతుబిడ్డ అంటూ వస్తున్నాడని తోటి కంటెస్టెంట్స్ అభిప్రాయం. అందుకే ఎక్కడ గెలుస్తాడో అని అతడిని బయటకు పంపించే పనిలో పడ్డారు. నామినేషన్ తర్వాత ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన పల్లవి ప్రశాంత్ తనని తాను రైతుబిడ్డ అని చెప్పడంలో తప్పేముందని చాలావరకు చర్చలు జరిగిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ ల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత.. నేనొక డాక్టర్ ని, నా దగ్గర వచ్చి బాడీ చూపిస్తూ మాట్లాడతాడా అంటూ గౌతమ్ కృష్ణ అన్నాడు. అయితే ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి బిగ్ బాస్ 4 రన్నర్ అఖిల్ సార్థక్ మాట్లాడుతూ... పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ అందుకే రైతు బిడ్డ అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకోవడం కరెక్ట్ కాదన్న వాళ్ళే ఇప్పుడు డాక్టర్ అని ఎందుకు చెప్పినట్టు అంటూ గౌతమ్ కృష్ణని ఉద్దేశించి అఖిల్ సార్థక్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు. ఇదేవిధంగా ఇప్పుడు గీతు రాయల్ కూడా రైతు బిడ్డ రైతు అని చెప్పుకుంటే తప్పా? డాక్టర్ నేను డాక్టర్ అని చెప్పుకుంటే తప్పు లేదా అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కాగా ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా మారింది. దీంతో పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగనుంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..