English | Telugu

శైలేంద్ర మాస్టర్ ప్లాన్ ని వాళ్ళిద్దరు కనిపెడతారా.. రిషి కాలేజీకి వస్తాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -869 లో....శైలేంద్ర వేసిన కన్నింగ్ ప్లాన్ లో భాగంగా సౌజన్యరావు అగ్రిమెంట్ పేపర్స్ పట్టుకొని వచ్చి డబ్బు కడతారా కాలేజీ సొంతం చేసుకోవాలా అని అంటాడు. అలా అనగానే జగతికి ఫణీంద్ర ఫోన్ చేసి చెప్తాడు. ఇక రిషి వస్తేనే సౌజన్యరావుకి బుద్ది చెప్తాడని మహేంద్ర, జగతి భావిస్తారు. రిషిని తమతో రమ్మని రిక్వెస్ట్ చేస్తారు.

రిషి మాత్రం ఆ కాలేజీలో అడుగుపెట్టనని కరాకండిగా చెప్పేసరికి.. ఆ కాలేజీ తాతగారు స్థాపించారు. నువ్వు విస్తరించావ్. ఇప్పుడు నువ్వు వస్తేనే ఈ సమస్యకి పరిష్కారమని మహేంద్ర అంటాడు. కాలేజీ ఎవరి సొంతమో కాబోతుంది. ఇప్పుడు కూడా ఇంతగా పట్టుదలతో ఉండాలా అని వసుధార అంటుంది. అలా అనగానే రిషి కోపంగా.. చేసిందంతా మీరు చేసి ఇప్పుడు నన్ను అంటున్నారా? నేను మాత్రం ఆ కాలేజీలో అడుగుపెట్టనని రిషి చెప్తాడు. మీరు రాకండి నేను వెళ్తాను నేను ఆ కాలేజీ లో పని చేశాను ఆ ఋణం తీర్చకుంటానని వసుధార అంటుంది. జగతి మహేంద్రలతో కలిసి వసుధార కాలేజీకి వెళ్తుంది. మరొక వైపు ఇంక ఎంత సేపు డబ్బు కట్టండి లేదా సంతకం చెయ్యండని సౌజన్య రావు అంటాడు. ఏం తెలియనట్టు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా కడతామని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర బయటకు వస్తారు. అప్పుడే వస్తున్న జగతి, మహేంద్ర, వసుధారలని చూస్తారు. రారన్నావ్. ఇప్పుడు ఏఙ చేద్దామని దేవయాని అంటుంది. అప్పటికప్పుడు శైలేంద్ర కన్నింగ్ గా థింక్ చేస్తుంటాడు‌. అప్పుడే వాళ్ళిద్దరి దగ్గరికి ఫణీంద్ర వస్తాడు. పిన్ని బాబయ్ ఇద్దరు రిషిని కలవడానికి వెళ్లారు. ఎప్పటినుండో వెళ్లి వస్తున్నారంటూ రిషి, వసుధారలకి సన్మానం చేసిన ఫోటోని చూపిస్తాడు. అంతేకాకుండా మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు కూడా వాళ్ళకే ఇచ్చారు చూడండి. కావాలంటే వసుధార వాళ్ళతో వస్తుంది చూడండి అంటూ ఫణింద్రకు శైలేంద్ర చెప్తాడు. ఫణింద్ర ఒక్కసారిగా షాక్ అవుతు.. నా తమ్ముడు నా దగ్గర ఇంత దాస్తున్నాడా అంటాడు. ఆ తర్వాత జగతి, మహేంద్ర రాగానే నాకు రిషి గురించి ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ సౌజన్యరావు ప్రాబ్లమ్ క్లియర్ చేద్దామని జగతి అంటుంది.

ఆ తర్వాత సౌజన్యరావుతో జగతి, మహేంద్ర మాట్లాడతారు. సౌజన్య రావు అగ్రిమెంట్ ని చూపిస్తాడు. ఎందుకు ఇలా చేసావని శైలేంద్ర పై మహేంద్ర కోప్పడతాడు. మీకు ఎక్కవ టైం లేదు.. డిసైడ్ అవ్వండని సౌజన్య రావు అనగానే.. మహేంద్ర, ఫణింద్ర ఇద్దరు బయటవైపు వెళ్తారు. ఈ విషయం ఎలాగైనా రిషి సర్ కి చెప్పాలని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.