Read more!

English | Telugu

అనుపమ మాయలో మహేంద్ర.. అసలు వాళ్ళిద్దరి గతమేంటి?


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -903 లో.. అనుపమ తన పెద్దమ్మతో  వీడియో కాల్ లో మాట్లాడుతుంది. మహేంద్ర, జగతి గురించి తన పెద్దమ్మతో డిస్కషన్ చేస్తుంది అనుపమ. జగతి నా ప్రాణం.. అప్పుడు జగతి గురించి అలోచించి మంచి నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడూ దానికే కట్టుబడి ఉంటానని అనుపమ అనగానే.. మరి మహేంద్ర అంటే ఇష్టం కదా ఆ విషయం చెప్పవా అని వాళ్ళ పెద్దమ్మ అడుగుతుంది. చెప్పను, చెప్పలేను ఇప్పటికి, ఎప్పటికి వాళ్ళు హ్యాపీగా ఉండేలా చూస్తానని అనుపమ ఎమోషనల్ అవుతుంది. 

ఆ తర్వాత జగతి గురించి మహేంద్ర ఎందుకు చెప్పడం లేదు. ఇన్ని రోజులు వాళ్ళు దూరంగానే ఉన్నారా  అసలు కారణం ఏంటని అనుపమ కనుక్కోవాలని  అనుకుంటుంది. ఆ తర్వాత మహేంద్రకి అనుపమ ఫోన్ చేస్తుంది. కానీ మాట్లాడలేక ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఫోన్ చేసింది కచ్చితంగా అనుపమ అయి ఉంటుందని మహేంద్ర అనుకుంటాడు. ఇన్ని రోజులుగా కనిపించని అనుపమ కన్పించడమేంటని మహేంద్ర అనుకుంటాడు. మరొకవైపు వసుధార అక్కడ రాయిపై ఉన్న పేర్లు గుర్తు చేసుకొని.. జగతి మేడమ్ మహేంద్ర సర్ ల పక్కన అనుపమ అనే పేరు ఉంది. ఎవరా అనుపమ? అసలు ఎవరు ఆమె.. మహేంద్ర సర్ ఇది వరకు ఇక్కడికి వచ్చారా? అందుకే వచ్చిన రోజు అలా బెహేవ్ చేసాడా? మహేంద్ర సర్ కీ గతం ఉందా అని వసుధార అనుకుంటుంది. డాడ్ ని ప్రశాంతత కోసం ఇక్కడికి తీసుకొని వస్తే, ఇక్కడ కూడా డాడ్ అలాగే ఉంటున్నాడని రిషి ఆలోచిస్తుంటాడు. మరొక వైపు ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను జగతి అంటు అనుపమ ఆలోచిస్తుంటుంది.

మరొక వైపు మహేంద్ర నిద్రలో నుండి లేచి ఒక్కసారిగా అను అంటూ గట్టిగా అరుస్తాడు. రిషి వచ్చి ఏంటని అడిగిన సమాధానం చెప్పడు. ఆ తర్వాత రిషి మందు తీసుకొని వచ్చి.. మీరు తాగండి. నాకు కొంచెం ఇవ్వండి. నాకు బాధగా ఉందని అంటాడు. అప్పుడే వసుధార వచ్చి మహేంద్ర సర్ ఇలా మందు తాగకుండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు మాట్లాడుకుంటారు.. నా శత్రువులు ఎవరు వసుధార అని రిషి అడుగుతాడు. శైలేంద్ర, దేవయాని వాళ్లే మొత్తం చేశారంటూ వసుధార చెప్పినట్లుగా తను ఊహించుకుంటుంది. ఆ తర్వాత రిషి తనని చెంపపై కొట్టినట్లు వసుధార ఉహించుకుంటుంది. ఏంటి వసుధార మాట్లాడం లేదు? నా శత్రువులు ఎవరో చెప్పు అనగానే త్వరలోనే తెలుస్తుందని, నాకు నిద్ర వస్తుందని వసుధార చెప్తుంది. లోపలికి వెళదామంటు రిషికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.