English | Telugu

కావ్యని తన బెడ్ మీద పడుకోబెట్టిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -236 లో.. రాజ్ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు నేను కళావతిని ప్రేమించడం లేదని అరుస్తుంటాడు. అప్పుడే కావ్య వచ్చి.. ఏంటి లేదంటున్నారని అడుగుతుంది. అంటే గాలి లేదు అంటున్నానని రాజ్ కవర్ చేస్తాడు. గాలి లేకుంటే ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అని వెళ్లి ఫ్యాన్ వేస్తుంది..

ఆ తర్వాత ఏసీ కూడా వెయ్యాలా అని రాజ్ ని అడుగుతుంది. నాకు చల్లదనం వద్దని రాజ్ అంటాడు. కొద్దీసేపు రాజ్ ని కావ్య సరదాగా ఆడుకుంటుంది. కాసేపటికి నిద్రొస్తుందంటూ తన పరుపు తీసుకొని వచ్చి కింద వేస్తుంది. అప్పుడే వాళ్ళ గది డోర్ కొడుతూ ఇందిరాదేవి‌ కావ్యని పిలుస్తుంది. ఆ పరుపు ఏంటి అని నానమ్మ అడుగుతుందని రాజ్ టెన్షన్ పడి, ఆ పరుపు తీసి వెనకాల డోర్ నుండి కిందకి పడేస్తాడు. ఆ తర్వాత కావ్య డోర్ తీసి.. ఏంటి అమ్మమ్మ గారు అని అడుగుతుంది.

ఏం లేదు ఈ పాలు తీసుకోమని ఇస్తుంది.. ఆ తర్వాత నీ పరుపు తీసుకొని వస్తానని రాజ్ కిందకి వెళ్తుంటే.. హాల్లో కూర్చొని ఉన్న ధాన్యలక్ష్మి.. ఇంట్లో తన భర్త ప్రకాశ్ కనిపించడం లేదని ఇందిరాదేవి, రుద్రాణి, అపర్ణలతో బాధపడుతు చెప్తుంది. అప్పుడే రాజ్ సడన్ గా మళ్ళీ గదిలోకి వెళ్లి వెనకాల డోర్ దగ్గర పరుపు వేసిన చోటుకి వెళ్లి చూడగానే.. ప్రకాశ్ పై పరుపు పడి ఉండడం చూసి రాజ్ మరింత టెన్షన్ పడుతాడు.. ఆ తర్వాత రాజ్ హాల్లో కూర్చొని ఉన్న దాన్యలక్ష్మికి బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు టెన్షన్ పడకని చెప్పి బయటకు వచ్చి పరువు తీసేసి ప్రకాష్ ని లేపుతాడు. ఆ తర్వాత ప్రకాష్ లేచి.. నేను ఎక్కడ ఉన్నానంటూ అయోమయంగా మాట్లాడుతుంటాడు.

ఆ తర్వాత ప్రకాష్ ని రాజ్ లోపలికి తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి వెళ్లారని ప్రకాష్ ని ధాన్యలక్ష్మి అడుగుతుంది.. ప్రకాష్ తల తిక్కగా సమాధానం చెప్తుంటాడు. ఆ తర్వాత రాజ్ గదిలోకి వెళ్తాడు. మీరు పరుపు తీసుకొని రాలేదంటే.. మీ ఉదేశ్యమేంటి అంటు కావ్య మళ్ళీ రాజ్ ని ఒక అట ఆడుకుంటుంది. నువ్వు బెడ్ పై పడుకోమని కావ్యతో చెప్పి రాజ్ పడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..