Read more!

English | Telugu

సర్జరీ తర్వాత మురారిని కృష్ణ, ముకుంద కనిపెట్టగలరా?

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -297 లో.. కృష్ణ మురారి కోసం చూస్తుంటుంది. మరొక వైపు ప్లాస్టిక్ సర్జరి జరిగి గతం మర్చిపోయిన మురారి మెల్లిగా కృష్ణ దగ్గరికి వస్తాడు.. మురారి ఎదరుగా ఉన్నా కృష్ణ గుర్తుపట్టదు. ఎందుకంటే మురారి సర్జరి తర్వాత వేరొక మొహంతో ఉంటాడు.

ఆ తర్వాత కృష్ణ దగ్గరికి వచ్చిన మురారిని.. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతుంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదని మురారి అంటాడు. మరొక వైపు డాక్టర్స్ మురారి బెడ్ పై లేడు, ఎక్కడికి వెళ్ళాడని అనుకుంటారు. ఆ పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా అని మురారి గురించి మాట్లాడుకోవడం ముకుంద వింటుంది. మురారి కన్పించడం లేదా రూపం మారిన మురారిని  ఇప్పుడు నేనెలా గుర్తుపట్టాలి. అసలు నేను డాక్టర్స్ ని అడిగితే వాళ్ళకి నా గురించి తెలిసిపోతుందని ముకుంద అనుకుంటుంది. మరొకవైపు మురారిని తీసుకొని కృష్ణ డాక్టర్ దగ్గరికి వస్తుంది. అది చుసిన ముకుంద డాక్టర్ చెప్పిన మురారి ఇతనేనా కృష్ణతో ఎందుకు వస్తున్నాడని అనుకుంటుంది. కృష్ణ రూపం మారిన  మురారిని  డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. మరొక వైపు కృష్ణ మురారిలని గుర్తుకుచేసుకొని మధు బాధపడుతుంటాడు. అప్పుడే  మధు దగ్గరికి  రేవతి వస్తుంది. కృష్ణ ఎక్కడ ఉందోనని మధు అంటాడు. మరొక వైపు మురారికి కర్మకాండ ఏంటి? నిజమేంటని రేవతి అత్తయ్యకి చెప్తానని ముకుంద రేవతికి చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ ముకుందకీ చెప్పే ఛాన్స్ ఇవ్వదు రేవతి.

ఆ తర్వాత ముకుంద స్టేషన్ కీ వెళ్లి.. తన అన్నయ్యతో కృష్ణ బ్రతికే ఉందని చెప్తుంది.  ఆ తర్వాత అతను ముకుందకి ఒక ప్లాన్ చెప్తాడు. సరే అని ముకుంద అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు కృష్ణ డాక్టర్స్ తో రూపం మరి ఉన్న మురారి గురించి తెలుసుకుంటుంది.. ఆ తర్వాత అతనే నా మురారి అని కృష్ణ అనుకొని ప్రభాకర్ దగ్గరకు వెళ్తుంది. మరొకవైపు ప్రభాకర్ శకుంతల మాట్లాడుకుంటారు. ఇప్పుడే నేను వెళ్లి మురారి లేడని చెప్తానని ప్రభాకర్ అనడం.. అప్పుడే వచ్చిన కృష్ణ వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.