English | Telugu
బిగ్ బాస్ లోకి అంబటి అర్జున్ ఎంట్రీ.. ఉల్టా పల్టా షురూ!
Updated : Sep 15, 2023
బిగ్ బాస్ సీజన్-7 మొదలైయి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. గత సీజన్ లలో కంటే కూడా ఈ సీజన్ మరింత రెట్టింపు ఉత్సాహంతో మొదలయింది హౌస్ లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు మొదట్లో వార్తలు వినిపించిన వాటన్నిటికి ఉల్టా పల్టా చేస్తూ బిగ్ బాస్ 14 మంది మాత్రమే హౌస్ లోకి తీసుకొచ్చారు.
ఇప్పటికే హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య రచ్చ కొనసాగుతుండగా ఇక నామినేషన్ అంటే ప్రేక్షకులకు పండగే అన్నట్టుగా తయారవుతుంది. ఇక నాగార్జున క్లాస్ పీకే శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో క్యూరియసిటీతో ఉన్నారని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఈ వారంలో మిగత కంటెస్టెంట్స్ నీ హౌస్ లోకి పంపిస్తున్నట్లు గత వారం నుండి న్యూస్ వైరల్ అవుతుంది. కానీ తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అంబటి అర్జున్ ఈ వెకెండ్ లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అంబటి అర్జున్ గనుక హౌస్ లోకి వెళ్తే హౌస్ లో గేమ్ మరింత రసవత్తరంగా ఉంటుందని అనడంలో ఆశ్చర్యం లేదు. రెండు వరాలు హౌస్ లో ఉన్నా వాళ్ళ ఆట తీరు, మాటతీరు.. హౌస్ లో ఉన్న వారిపట్ల ప్రవర్తన అలాగే ప్రేక్షకుల అభిప్రాయం కొంతవరకు తెలుసుకొని వెళ్తున్నాడు అంబటి అర్జున్. కాబట్టి అంబటి అర్జున్ మైండ్ గేమ్ ఆడుతాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంబటి అర్జున్ ఎంట్రీ నిజమైతే హౌజ్ లో మరింత ఎంటర్టైన్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే తను హౌజ్ లోకి వెళ్తాడా? లేదా తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో అతని ఎంట్రీ కన్ఫమ్ అంటూ స్ట్రాంగ్ గా చెప్పడంతో ఈ ఎంట్రీపై మరింత హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు అంబటి అర్జున్ తన ఇన్ స్టాగ్రామ్ లో.. '' నోటిఫీకేషన్స్ ఆన్ " అంటూ ఒక పోస్ట్ చేశాడు. దీంతో ఇది పక్కా అన్నట్టు స్పష్టమవుతుంది.