English | Telugu

కట్ చేయకు.. ఓపెన్ చేయి అన్న ధన్ రాజ్...ఫ్లూట్ జింక ముందు ఊదు అన్న ఆలీ

"ఆలీతో అల్ ఇన్ వన్" ప్రొగ్రాం ప్రతీ వారంలాగే ఆడియన్స్ అలరించడానికి ఈ వారం కూడా రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే అన్నట్టుంది. ఈ వారం షో గెస్ట్ లు ఎవరు అంటే...ధనాధన్ ధనరాజ్ , భాను శ్రీ , బలగం మూవీ డైరెక్టర్ వేణు వచ్చారు. మొదట ఎంట్రీ ఇచ్చిన గెస్ట్ ధనరాజ్.. ఆలీ కలిసి డాన్స్ చేసి ఒక ఊపు ఊపేసారు. "ధనరాజ్ ని ఏంటి ..చేతులు కట్టుకున్నావ్ బుద్ధిమంతుడిలాగ " అని అలీ అడిగేసరికి " మిమల్ని చూసి పెద్దల దగ్గర ఎలా ఉండాలో నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళం మేం కాబట్టి" అని అన్నాడు ధన్ రాజ్. ఆ మాటకు ఆలీ బాగా నవ్వేసాడు. నెక్స్ట్ గెస్ట్ గా భానుశ్రీ వచ్చింది. ఎంట్రీలోనే డాన్స్ అదరకొట్టేసింది. "ఇది కదా అమ్మాయి" అని అలీ అనేసరికి "ధన్ రాజ్ నా గురించి ఏమన్నా అన్నారేమిటి వచ్చేముందు" అని అడిగింది భానుశ్రీ దానికి ధన్ రాజ్ " కాసేపు మాట్లాడాక మీకు అర్ధమవుతుంది" అన్నాడు. ఆ తరువాత వేణు మంచి జోష్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఇప్పటికి 107 అవార్డ్స్ ఇక ఎన్ని కొట్టుకుంటావ్ అయ్యా" అని నవ్వుతూ ఆలి అడిగాడు. దానికి వేణు " తెలియడం లేదన్న అలా వెళ్ళిపోతా ఉంది" అని నవ్వుతూ చెప్పాడు.

ఆ మాటకి అందరూ నవ్వేశారు. తర్వాత ఆలీ "ఒక మంచి కథ నాకు 2 నిముషాల్లో చెప్పాలి" అనేసరికి "వాడు బాగా చెప్తాడు..వాడు వాళ్ళ ఆవిడకి రోజు 12 కథలు చెప్తాడు సర్ " అని ధన్ రాజ్ వైపు చెయ్యి చూపించాడు వేణు. ఆ మాటకు ధన్ రాజ్ రెస్పాండ్ అయ్యాడు. " బలగం డైరెక్టర్ ధనరాజ్ కి ఒక కథ చెప్పాడు.. వాడు దాని రిజెక్ట్ చేసాడు" అని అన్నాడు. ఇక భానుశ్రీ దసరా మూవీలో ఒక మంచి మాస్ సాంగ్ కి స్టెప్పులేసి ఆడియెన్సు ని ఎంటర్టైన్ చేసింది. భానుశ్రీ ఒక స్టోరీ చెప్తూ "సర్ కట్ చేస్తే" అని అనేసరికి ధన్ రాజ్ ఎంట్రీ ఇచ్చి " కట్ చేయకు.. ఓపెన్ చేయి" అని కౌంటర్ వేసాడు. ఆలీ వచ్చిన గెస్టులతో గేమ్స్ ఆడించాడు. "మ్యూజిక్ అంటే ఇష్టమా" అని ఆలీ వేణుని అడగడంతో "ఫ్లూట్ అంటే ఇష్టం" అన్నాడు "ఫ్లూట్ జింక ముందు ఊదు" అంటూ ఆలీ బాలకృష్ణ రేంజ్ లో డైలాగ్ చెప్పాడు. ఇక ప్రోమో చివర్లో "మేమే ఇండియన్స్" అనే సాంగ్ కి డాన్స్ చేసి అందరిని బాగా అలరించారు. ప్రోమోనే ఇంత అదిరిపోతే ఎపిసోడ్ మొత్తం దద్దరిలిపోతుంది.