English | Telugu
నా మొదటి మెమోరెబుల్ ట్రిప్ టూ ఇటలీ!
Updated : Aug 12, 2023
దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. అలా నక్క తోక తొక్కినట్లు వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది.
దివి వాద్య ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో చేసి మెప్పించింది. తాజాగా వచ్చిన 'భోలా శంకర్' మూవీలో నటించింది.. ఈ సొట్ట బుగ్గల సుందరి. అయితే దివి కొంతకాలం నుంచి తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ పెడుతూ యూత్ ని ఆకర్షిస్తోంది. అలా తను ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది ఇటీవల జీ-5లో విడుదలైన 'ఏటీఎమ్' వెబ్ సిరీస్ లో నటించింది దివి.
అందాల ఆరబోతలో దివి తర్వాతే మరొకరని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూసినా బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ అమ్మడు. దివి తాజాగా ఇటలీ వెళ్లిందట.. అది తన మెమోరెబుల్ మూమెంట్ అంట. దివి విదేశాలకి వెళ్ళటం కొత్తేమీ కాదు.. ఎప్పుడు ఏదో ఒక టూర్ అంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటుంది. ' నా మొదటి మొమొరెబుల్ ట్రిప్ టూ ఇటలీ' అని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దివి. కాగా ఇప్పుడు ఈ వీడియోకి అటు పాజిటివ్ కామెంట్స్, ఇటు నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో దివి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.