English | Telugu
మురారి ప్రేమిస్తున్న విషయం కృష్ణకి నందు చెప్పగలదా?
Updated : Aug 13, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -234లో.. కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ని తనకిచ్చేసి వెళ్ళిపోతాడు మురారి. దాంతో కృష్ణ ఎమోషనల్ అవుతుంది. గతాన్ని తల్చుకుంటూ ఏడుస్తుంటుంది కృష్ణ. మరొకవైపు ముకుంద తన గదిలో ఒంటరిగా ఉంటుంది. కృష్ణ వెళ్లిపోతుంది. ఇంకా కొన్ని రోజుల్లో మురారి నా సొంతం అవుతాడని, దేవుడికి థాంక్స్ చెప్పుకుంటుంది ముకుంద.
ఆ తర్వాత ముకుంద దగ్గరికి అలేఖ్య వస్తుంది. రా అలేఖ్య.. నువ్వు వస్తావని నాకు తెలుసని ముకుంద అనగానే.. నీకెలా తెలుసని అలేఖ్య అంటుంది. ఈ ఇంట్లో ఏది జరిగినా ముందు నీకే కదా తెలిసేదని ముకుంద అంటుంది. ఇప్పుడేం జరిగిందని అలేఖ్య అడిగేసరికి.. నా లవ్ సక్సెస్ కాదన్నావ్ కదా? నీకన్నీ తెలుసంటావ్ కానీ సగం సగమే తెలుసని ముకుంద అనగానే.. హా ఇప్పుడేం జరిగిందో తొందరగా చెప్పు అసలే సస్పెన్స్ నేను భరించలేనని అలేఖ్య అంటుంది. కృష్ణ క్యాంప్ కి వెళ్తుంది మళ్ళీ తిరిగి రాదని ముకుంద అనగానే.. హా అర్థమైంది క్యాంప్ నుండి ఇంటికి రాకుండా అటునుండి అటే వాళ్ళింటికి వెళ్ళేలా భలే ప్లాన్ చేశావ్ ముకుంద అని అలేఖ్య అనగానే.. నేను ప్లాన్ చేయడమేంటి? నా ప్రేమని దక్కించుకోవాలనుకుంటాను కానీ కృష్ణని బయటకు పంపించాలని నా ఉద్దేశం కాదని ముకుంద అనగానే.. హా తెలుసులే ఇదే విషయం చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా అని అలేఖ్య మనసులో అనుకొని.. నీ ప్రేమ గొప్పది ముకుంద.. నువ్వు అనుకున్నది సాధిస్తావని ముకుందతో అలేఖ్య అంటుంది. మరొకవైపు మురారి, కృష్ణల గురించి నందు ఆలోచిస్తుంటుంది. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావని గౌతమ్ అడుగగా.. కొన్నరోజుల్లో మురారి, కృష్ణ శాశ్వతంగా విడిపోతున్నారని నందు చెప్తుంది. అసలు భార్యాభర్తలు విడిపోవడమేంటని గౌతమ్ అడుగగా.. వాళ్ళు నిజమైన భార్యాభర్తలు కాదని, వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని జరిగిందంతా గౌతమ్ కి చెప్తుంది నందు.
ఆ తర్వాత నా ప్లేస్ లో నువ్వుంటే ఏం చేసేవాడివని గౌతమ్ ని నందు అడుగగా.. ఇద్దరిని కలపడానికి మురారికి నువ్వు ఇచ్చిన ఒట్టుని తీసి గట్టుమీద పెట్టేయమని అంటాడు. ఇద్దరిని కలపడానికి ఒట్టు తీస్తే ప్రాబ్లమ్ లేదని గౌతమ్ చెప్తాడు. కృష్ణ క్యాంప్ కి వెళ్ళేలోపు కృష్ణని మురారి ప్రేమిస్తున్నాడనే నిజం తనకి తెలియాలని గౌతమ్ తో నందు అంటుంది. మరొకవైపు కృష్ణ గురించి మురారి ఆలోచిస్తుంటాడు. అప్పుడే గదిలోకి కృష్ణ వస్తుంది. హాయ్ కృష్ణ అని మురారి అనగానే.. మీరు హాయ్ చెప్తుంటే శాశ్వతంగా నాకు బై చెప్తున్నట్టుగా అనిపిస్తుందని కృష్ణ అంటుంది. అదేం లేదని మురారి అంటాడు. ఆ తర్వాత చీర మార్చుకోవాలని చెప్పి మురారిని బయటకు వెళ్ళమని కృష్ణ చెప్తుంది. అలా చెప్పిన తర్వాత కృష్ణ తను తీసుకున్న ఫ్లూట్ ని గిఫ్ట్ గా చేసి కబోడ్ లో మురారి కోసం దాస్తుంది. కాసేపటికి లోపలికి వచ్చిన మురారి.. ఏంటి కృష్ణ చీర మార్చుకుంటానని అంది. మార్చుకోలేదని అనుకుంటాడు. ఎక్కువగా ఆలోచించకండి ఏసీపీ సర్ తర్వాత అన్నీ అర్థమవుతాయని కృష్ణ చెప్తుంది. మరుసటి రోజు కృష్ణ తన బ్యాగ్ సర్దుకుంటూ బాధపడుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.