English | Telugu
దొంగని కనిపెట్టిన అఖిల్
Updated : Jun 11, 2022
శ్యామా , అఖిల్ విగ్నేశ్వర అభిషేకానికి తయారవుతూ ఉంటారు. ఇంతలో బీరువా తీసేసరికి అక్కడ శంకర్ ఇచ్చిన కిరీటం కనిపించదు. అంతే ఒక్కసారి షాక్ అవుతుంది. అఖిల్ కి విషయం చెప్తుంది. ఇల్లంతా వెతికినా కనిపించదు. ఏం చేయాలో తెలియక ఇద్దరూ భయపడుతూ ఉంటారు.ఇంతలో వసంత వచ్చి బీరువా తాళాలు అడుగుతుంది. శ్యామాకి ఏం అర్థంకాక తాళాలు ఇచ్చేసి అఖిల్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక శ్యామా ఈ గండం నుంచి గట్టెక్కించమని కన్నయ్యను కోరుకుంటుంది. ఇంతలో అఖిల్ కి ఆ రూమ్ కిటికీ తలుపు దగ్గర స్క్రూలు కనిపిస్తాయి. కిరీటం ఎవరో తెలిసిన వాళ్ళే దొంగతనం చేసారని తెలుసుకుంటారు. అంతలో కింద పట్టా మీద సగం కాలిన బీడీని చూస్తుంది శ్యామా. అది తోటమాలి కాలుస్తాడు అన్న విషయం గుర్తుతెచ్చుకుని అతన్ని వెతుకుతుంది.
పెరట్లో కనిపించకపోయేసరికి వాళ్ళింటికి వెళ్తారు ఇద్దారూ . వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి తాగి ఎక్కడ పడిపోయాడో అంటుంది తోటమాలి భార్య. మరో వైపు శంకర్ తన కిరీటం కోసం వర్మ ఇంటికి వస్తాడు. ఐతే వర్మ ఒక గంట ఆగాక కిరీటం ఇస్తాను. ఎందుకంటే ఇందాకే రాహు కాలం వచ్చేసింది ఇలాంటి సమయంలో కిరీటం తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అంటాడు. మిగతా ఎపిసోడ్ ఈరోజు మధ్యాహ్నం వచ్చే కృష్ణ తులసి సీరియల్ లో చూడొచ్చు.