English | Telugu
డెలివరీ తర్వాత సీరియల్ లోకి రీఎంట్రీ ఇచ్చిన నటి శ్రావణి
Updated : Jun 11, 2022
ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లోకి నటి శ్రావణి రీఎంట్రీ ఇచ్చేసింది. మళ్ళీ దమయంతి కేరెక్టర్ లో శ్రావణి కావాలి అంటూ మిగతా ఆర్టిస్ట్స్ కూడా గట్టిగా పట్టుబట్టేసరికి మళ్ళీ మేకప్ వేసుకోవడానికి షూటింగ్ స్పాట్ కే వచ్చేసింది. మార్చ్ 16 న పండంటి బాబుని ప్రసవించిన శ్రావణి షార్ట్ పీరియడ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసింది. ఇక దమయంతి హౌస్ లో శ్రావణి మేకప్ చేసుకుని మిగతా ఆర్టిస్ట్స్ అందరిని పలకరించింది. పాత టీం అందరూ కలిసి షూటింగ్ స్పాట్ లో మంచి మస్తీ చేశారు.
సీరియల్స్ లో ఎప్పుడూ అరుచుకుంటూ , కొట్టుకుంటూ, తిట్టుకుంటూ కనిపిస్తాం కానీ సీరియల్ షూటింగ్ స్పాట్ లో మాత్రం అందరం ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అన్ని షేర్ చేసుకుంటాం అని చెప్పింది శ్రావణి . ఒక తల్లిగా ఉన్న ఫీలింగ్ వేరు. కానీ షూటింగ్ ని చాలా మిస్ అయ్యాను ఈ ఫన్ అంతా మిస్సయ్యాను అనే ఫీలింగ్ వేరు. ఏదేమైనా టైగర్ దమయంతి ఈజ్ బ్యాక్ ..మరి నా కేరెక్టర్ ని సీరియల్ లో ఇకనుంచి చూసేయండి అంటూ శ్రావణి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియన్స్ కి తన రీఎంట్రీ వీడియొ షూట్ లో చెప్పేసింది.