English | Telugu

'డ్యాన్స్ ఐకాన్' షోకి నటి రమ్యకృష్ణ

ఓంకార్ యాంకర్ గా, ప్రొడ్యూసర్ గా తీసుకురాబోతున్న 'డ్యాన్స్ ఐకాన్' షో మీద రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఐతే ఇప్పుడు ఈ షోలోకి నటి రమ్య కృష్ణ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. డాన్స్ షోస్ కి జడ్జిగా వ్యవహరించే శేఖర్ మాస్టర్ తో పాటు రమ్య కృష్ణ కూడా న్యాయనిర్ణేతలుగా ఉండబోతున్నట్టు సమాచారం అందుతోంది. రమ్యకృష్ణ బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా చేసింది. అలాగే ఫిక్షన్ సీరియల్ నాగభైరవిని కూడా అప్పట్లో ప్రమోట్ చేసింది. ఓంకార్ డాన్స్ షోస్ లో జడ్జెస్ గా ఉండే యశ్వంత్, మోనాల్ గుజ్జర్ తో పాటు ఇప్పుడు శ్రీముఖి కూడా కనిపించబోతోంది.

ఇక ఈ షోలో 5-50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు పాల్గొంటారని మేకర్స్ ఎప్పుడో చెప్పారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ, అనన్య పాండేని స్పెషల్ గెస్ట్స్ గా తీసుకురాబోతున్నట్టు, అలాగే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్టు సమాచారం. టీవీలో, OTTలో ఒకేసారి ప్రసారమయ్యే మొదటి తెలుగు డ్యాన్స్ రియాలిటీ షోస్ లో ఈ డాన్స్ ఐకాన్ ఒకటి. ఐతే ఈ జడ్జెస్, స్పెషల్ గెస్ట్స్ కి సంబంధించిన ఆఫీషియల్ న్యూస్ త్వరలో రానుంది.