English | Telugu
చిరంజీవికి బుల్లి తెర స్టార్స్ విషెస్!
Updated : Aug 23, 2022
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎంతో మంది విషెస్ చెప్పారు. సోషల్ మీడియా మొత్తం కూడా చిరు ఫొటోస్ హల్చల్ చేశాయి. అలాగే బుల్లి తెర స్టార్స్ కూడా చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని ఆయనతో దిగిన ఫొటోస్ ని షేర్ చేసుకుని ఫుల్ కుష్ అయ్యారు. జబర్దస్త్ నటుడు గెటప్ శీను ఐతే " మెమోరీస్ విత్ మై బాస్ " అంటూ ఆయనతో ఉన్న ఫోటో షేర్ చేసాడు. "మనిషి మాత్రమే మెగాస్టార్ కాదు..మనసు కూడా మెగాస్టార్" అంటూ యాంకర్ శ్రీముఖి చిరంజీవికి ఫ్లవర్ బొకే ఇచ్చిన ఫోటో పోస్ట్ చేసింది. " ది బాస్ అఫ్ ది బాసెస్" అంటూ అలీ రెజా ఫోటో ఇన్స్టా స్టేటస్ లో పెట్టుకున్నాడు. "మీ అడుగు, మీ మాట, మీ పని మమ్మల్ని ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది" అంటూ యాంకర్ రవి పోస్ట్ చేసాడు. "హ్యాపీ బర్త్ డే చిరు సర్" అంటూ అరియనా పోస్ట్ చేసింది.
"నడక కలిసిన నవరాత్రి" అనే సాంగ్ చూసి ఒక షోలో ఫిదా ఐన చిరంజీవి వీడియో పోస్ట్ చేసాడు శ్రీరామచంద్ర. "మీరెప్పటికీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్" అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ చిరుతో దిగిన ఫోటో పెట్టి పోస్ట్ చేసుకున్నాడు. ఇక శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ ఐతే చిరు పోస్టర్స్ అంటించి ఆ పోస్టర్స్ ఎదురుగా చిరు సాంగ్స్ కి డాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేసాడు. "నాకు మీరే ఇన్స్పిరేషన్" అంటూ సుడిగాలి సుధీర్ చిరు ఆశీస్సులు తీసుకుంటూ ఉన్న ఫోటో పోస్ట్ చేసాడు. ఇలా బుల్లి తెర యాంకర్స్, జబర్దస్త్ కమెడియన్స్, సింగర్స్ అందరూ కూడా చిరు కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.