English | Telugu

అది సెల్ఫ్ కంట్రోలా.. సిరి కంట్రోలా అనేది తెలియదు!

బిగ్ బాస్ హౌస్ లో ఈ దీపావళి ఎపిసోడ్ మాత్రం హౌస్ మేట్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇక ఆది శ్రీహాన్ గురించి చెప్తూ "మొదటి రోజు హౌస్ లోకి వెళ్ళాక నువ్ వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు నీకు షుగర్ అనుకున్నా..కానీ కాదని తర్వాత అర్ధమయ్యింది. ఇక నువ్వు చాలా విషయాల్లో కంట్రోల్ గా ఉన్నావ్. మరి అది సెల్ఫ్ కంట్రోలా, సిరి కంట్రోలా అనేది తెలియదు.

ఎవరైనా సిరి సంపదల కోసం బిగ్ బాస్ కు వస్తారు కానీ శ్రీహాన్ మాత్రం సంపదతో ఇంట్లోంచి బయటకి వెళ్తే చాలు.. సిరి ఆల్రెడీ బయట ఉంది అంటూ టైమింగ్ తో కూడిన కామెడీ చేసాడు. ఇక ఇనయా శ్రీహాన్ ల బంధం గురించి చెప్తూ ఇద్దరూ గొడవ పడినప్పుడు వచ్చే కిక్కు మాములుగా ఉండదు. మీరు కలిసి ఉండేదాన్ని కంటే విడిపోయేటప్పుడు వచ్చే ఎంటర్టైన్ మంచి జోష్ గా ఉంటుంది. చూసావా విడిపోవా అనే మాటను నేను అనేసరికి అక్కడ సూర్యలో చిన్న స్మైల్ వచ్చింది. శ్రీహాన్ బయట ఎలా ఉంటాడో హౌస్ లో అలాగే ఉన్నాడు. ఎవరినీ నొప్పించడు..ఇలాగే గేమ్ ఆడు" అంటూ శ్రీహాన్ కి విషెస్ చెప్పాడు ఆది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.