English | Telugu

ఆన్లైన్ లో పెళ్లికూతురు బుకింగ్..నోరెళ్లబెట్టిన పవిత్ర


ఏది కొనాలన్నా కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే చాలు వెంటనే ఇంటికి వచ్చేస్తుంది. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడం చాలా ఈజీ...నచ్చని ప్రోడక్ట్ ని కూడా తిరిగిచ్చేసే ప్రాసెస్ కూడా ఇందులో సులువుగా ఉంటుంది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఒక స్కిట్ రేపు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. అజర్, రాంప్రసాద్ మరో కమెడియన్ ముగ్గురూ కలిసి బ్యాండ్ మేళం వాయిస్తూ వస్తారు. "ఎక్కడ బుక్ చేశారు వీళ్ళను" అని దొరబాబు ఆచంట మహేష్ ని అడిగాడు "ఆన్లైన్ లో బుక్ చేసాం" అని చెప్పాడు మహేష్. ఇంతలో మహేష్ పక్కకు పెళ్లి కూతురు గెటప్ లో వచ్చి నిలబడుతుంది పాగల్ పవిత్ర.

ఆమెను చూసిన రాంప్రసాద్ "ఆన్లైన్ లో బుక్ చేశారా " అని అడిగేసరికి "అవును ఆన్లైన్ లో బుక్ చేసాను " అని చెప్తాడు మహేష్. ఇక మహేష్, పవిత్ర పెళ్లి చెడగొట్టడం కోసం "మీ ఆవిడ ఢిల్లీలో ఎవరితోనే తిరిగింది" అని రాంప్రసాద్ అనేసరికి "హైదరాబాద్ లో కాదు కదా తిరిగింది" అని రివర్స్ కౌంటర్ వేసాడు మహేష్. "మీ కోడలు మంచిది కాదు" అని రాంప్రసాద్ దొరబాబుకి చెప్పేసరికి "ఇప్పుడు నేనేమన్నా మంచోడినా ఏమిటి" అని దొరబాబు రివర్స్ లో అడిగాడు. తర్వాత ఇమ్మానుయేల్, వర్ష, బాబు, శ్రీవిద్య స్కిట్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. నిద్రలోంచి లేచి పక్కింట్లోకి వెళ్ళిపోతున్న వర్షను ఇమ్ము తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టే కాన్సెప్ట్ బాగుంది. ఆ తర్వాత రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఇద్దరూ కలిసి ఒక స్కిట్ చేశారు. రాకేష్ ఇంటికి తొందరగా వచ్చిన, లేట్ గా వచ్చినా భర్తను ఊరికే సతాయించే రోల్ లో మంచి కామెడీ పండించింది సుజాత. ఇలా ఈ వారం ఎక్స్ట్రా జబర్దస్త్ రాబోతోంది.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.