English | Telugu
ఫ్యామిలీ స్టార్స్ లాంటి షోస్ కి రావొచ్చని మూవీస్ కి గ్యాప్ ఇచ్చా.. నటి జ్యోతి
Updated : Nov 30, 2025
ఫ్యామిలీ స్టార్స్ లో పవిత్రతో కలిసి సందడి చేసింది. ఈ షోలో పవిత్ర జ్యోతిని కొన్ని ప్రశ్నలు అడిగింది. "పెళ్లినే జ్యోతి వద్దనుకుందా..పెళ్లి జ్యోతిని వద్దు అనుకుండా" అంటూ పవిత్ర నటి జ్యోతిని అడిగింది. దాంతో బ్యాక్ గ్రౌండ్ ఇదేం ప్రశ్న తింగరి ముఖందాన అనే కామెంట్ వినిపించింది. "ఈ కంటెంట్ డైరెక్టర్ వద్దనుకుంటున్నారు" అంటూ సుధీర్ కౌంటర్ వేసాడు. ఆన్సర్ చెప్పండి అని జ్యోతిని అడిగేసరికి "పెళ్లి నన్ను వద్దు అనుకుంటోంది. కానీ ఇక్కడ సుధీర్ ని చూసేసరికి " అంది జ్యోతి.
"అసలు నేను వెళ్లిపోవడమే మంచిదనుకుంటా.. ఇక్కడ నన్ను ఎందుకు కూర్చోబెట్టారో నాకు అర్ధం కావట్లేదు" అన్నాడు. "నీకో సామెత తెలుసా ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముల్లొచ్చి ఆకు మీద పడినా బొక్క ఎవరికీ సుధీర్ కి" అంటూ సుధీర్ మీద కామెంట్స్ చేశారు జ్యోతి, పవిత్ర. "మీరు ఇంత అందంగా ఉంటారు కదా మరి సినిమాల్లోకి కాకుండా ఇంటికే ఎందుకు పరిమితమైపోయారు" అని అడిగింది. "ఎవరు చెప్పారు ఇంటికి పరిమితమయ్యానని అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటే ఇలాంటి షోస్ కి రావొచ్చని" అంది జ్యోతి. "ఒహ్హ్ ఐతే ఇక్కడ చాలా మంది గ్యాప్ తీసుకున్నారు" అంది పవిత్ర . "జ్యోతిని జనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి" అని మళ్ళీ అడిగింది. "యు ఆర్ సో హాట్" అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి" అంది జ్యోతి.