English | Telugu

Divya Elimination : దివ్య ఎలిమినేషన్.. ఫుల్ క్లారిటీగా ఉందిగా!

లైఫ్ లో ఎప్పుడు ఎవరిని ఏం చేయాలని అడుగకు ఎందుకంటే నీ కంటూ ఓ క్లారిటీ ఉండాలి.. ‌ఇది జులాయి సినిమాలో డైలాగ్. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో ఎవరికి క్లారిటీ లేదు కానీ దివ్యకి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే తను ఎలిమినేషన్ అవుతానని ముందే తెలుసుకుంది. ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే దివ్య ఎలిమినేట్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తనకి స్ట్రాంగ్ ఓటింగ్ లేకపోవడం.. పీఆర్ సరిగ్గా లేకపోవడం.. భరణితో తను క్లోజ్ గా ఉండటం.. తను ఎలిమినేట్ అవ్వడానికి కారణం అయ్యాయి.

నిన్నటి సండే ఎపిసోడ్ లో నాగార్జున అందరితో సరదాగా మాట్లాడాడు. ఎప్పటిలాగే హౌస్ లోని కంటెస్టెంట్స్ ని రెండు టీమ్ లు డివైడ్ చేశాడు నాగార్జున. వారితో టాస్క్ ఆడించాడు‌. ఆ తర్వాత నామినేషన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు.‌ ఇక ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉండగా.. సుమన్ శెట్టి, దివ్య ఇద్దరు మాత్రం చివరి రౌండ్ వరకు మిగిలారు. వీరిద్దరి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. కాసేపు కంటెస్టెంట్స్ ని ఆడించి ఇక ఎలిమినేషన్ రౌండ్ కోసం ఇద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచాడు నాగార్జున. సుమన్, దివ్యల మందు రెండు అగ్నిపర్వతాలు ఉంచాడు బిగ్ బాస్. ఇందులో నుండి రెడ్ కలర్ వస్తే ఎలిమినేట్ , గ్రీన్ వస్తే సేఫ్ అని నాగార్జున చెప్పాడు. ఇక ఫై టూ వన్ కౌంట్ డౌన్ చేశాడు నాగార్జున. కాసేపటికి దివ్య ముందున్న అగ్నిపర్వతం నుండి రెడ్ కలర్ వచ్చింది. సుమన్ శెట్టి ముందున్న అగ్నిపర్వతం నుండి గ్రీన్ కలర్ బయటకు వచ్చింది. దాంతో దివ్య యూ ఆర్ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పేశాడు. ఇక సుమన్ కి హగ్ ఇచ్చి హౌస్ లోకి వెళ్ళింది దివ్య.

హౌస్ మేట్స్ అందరికి బై చెప్పేసి మెయిన్ గేట్ ద్వారా బయటకు వచ్చింది దివ్య. ఇక కాసేపటికి స్టేజ్ మీదకి వచ్చేసింది దివ్య. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయింది.