English | Telugu

Jayam serial : తాగేసి వచ్చి గొడవ చేసిన నాన్న.. కూతురు ఆ అప్పు తీర్చగలదా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -12 లో... రుద్రని దెయ్యం బొమ్మ లాగా గీసిన పేపర్ రుద్ర క్యాబిన్ లో ఉండడంతో ఎక్కడ అది చూస్తాడేమోనని గంగ టెన్షన్ పడుతూ తన క్యాబిన్ కి వెళ్తుంది. రుద్ర తనని చూడకుండా లోపలికి రమ్మంటాడు. ఆ బొమ్మ ఉన్న పేపర్ ని తీసుకొని వెళ్ళబోతుంటే రుద్ర చూసి నిన్ను ఎవరు లోపలికి రమ్మన్నారని కోప్పడుతాడు. మీరే కదా రమ్మన్నారని గంగ అంటుంది. నువ్వు ఇచ్చిన డబ్బు అక్కడ ఉంది తీసుకొని వెళ్ళు అని రుద్ర అనగానే డబ్బు కింద పేపర్ ఉంది కదా అని డబ్బుతో పాటు పేపర్ తీసుకుంటుంది గంగ. ఈ పేపర్ నాది అని రుద్ర లాక్కుంటాడు. నాది కాని డబ్బు నాకెందుకని గంగ డబ్బు అక్కడ పెట్టి వెళ్తుంది.

ఆ తర్వాత పైడిరాజు అప్పుల వాళ్లని తీసుకొని గంగ పనిచేసే సూపర్ మార్కెట్ దగ్గరకి వస్తాడు. సెక్యూరిటీ లోపలికి పంపించడు. అప్పుడే వీరు, గోపి అక్కడకి వస్తారు. వాళ్ళని చూసి ఎవరు అని సెక్యూరిటీ ని అడుగుతాడు. గంగ వాళ్ళ నాన్న అని సెక్యూరిటీ చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి గంగ వచ్చి.. నాన్న ఇప్పుడు డబ్బు లేదు రేపు ఇస్తానని రిక్వెస్ట్ చేస్తుంది. అదంతా వీరు చూస్తాడు. ఆ తర్వాత గంగ దగ్గరికి వీరు వచ్చి ఇదిగో డబ్బు అని ఇస్తాడు. వద్దని గంగ అంటుంది.

ఆ తర్వాత ఎలాగైనా రేపటి వరకు డబ్బు నాన్నకి ఇవ్వాలని గంగ అనుకుంటుంది. అదే సమయంలో ఒకతను రైస్ మిల్ దగ్గర వర్కర్స్ కోసం చూస్తుంటాడు. అప్పుడే గంగ వెళ్లి నేను ఏ పని అయినా చేస్తానంటుంది. బియ్యం బస్తాల లోడు ఎక్కించాలి.. దించాలనగానే సరే చేస్తానని గంగ పనిచేస్తూ ఉంటుంది. అక్కడే రుద్రతో పాటు వాళ్ళ పెద్దనాన్న కూడా ఉంటారు.

తరువాయి భాగంలో గంగ బస్తాలు మొయ్యడం రుద్ర వాళ్ళ పెద్దనాన్న చూసి.. నువ్వు బస్తాలు ఎందుకు మోస్తున్నావని అడుగుతాడు. ఇక వాళ్ళ నాన్న అప్పు సంగతి చెప్తుంది గంగ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.