English | Telugu
ఇండస్ట్రీకి కొత్త లిటిల్ సింగర్...
Updated : Jul 27, 2025
బిగ్ బాస్ సీజన్ 5 లో విశ్వ చేసిన సందడి, ఆడిన టాస్కులు ఎవరూ మర్చిపోరు. విశ్వా ఒక ఫిట్నెస్ ఫ్రీక్. అలాగే మూవీస్ లో నటిస్తూ ఉంటాడు. బుల్లితెర మీద షోస్ లో రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో ఐతే చెప్పక్కర్లేదు. ఫుల్ రీల్స్ , జిమ్ వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా తనతో పాటు తన సుపుత్రుడిని కూడా వెంట షోస్ కి తీసుకొస్తున్నాడు.
విశ్వా కుమారుడి పేరు ర్యాన్. ఈ పిల్లాడి అల్లరి చెప్పక్కర్లేదు. అంజలి - పవన్ వాళ్ళ అమ్మాయి చందమామకు మంచి స్నేహితుడు. టాస్కుల్లో ఆమెను గెలిపిస్తూ హ్యాపీగా ఉంటాడు. ఇక రీసెంట్ గా ర్యాన్ సింగింగ్ కూడా స్టార్ట్ చేసాడు. తనలో మంచి సింగర్ ఉన్నాడని గుర్తించిన విశ్వా ఒక మంచి పాటను పాడించారు స్టూడియోలో.
"అందం అమ్మాయైతే నీలా ఉందా" అనే అందమైన పాటని ఈ చిన్నారి ర్యాన్ పాడుతుంటే అద్భుతంగా ఉంది. ఇక ఫైనల్ లో "నేను సింగింగ్ ని ప్రాక్టీస్ చేస్తున్న. మరి నా సింగింగ్ ప్రాక్టీస్ ఎలా ఉందో కామెంట్స్ చెప్పండి" అని అన్నాడు. అంతే నెటిజన్స్ ఐతే "సూపర్ వాయిస్, సో క్యూట్ సింగర్..చందమామ కోసమా ఈ సాంగ్. నీ వాయిస్ ఇంకా వినాలనిపిస్తోంది. సూపర్ చిన్నా...గాడ్ బ్లేస్ యు" అంటూ విషెస్ చెప్తున్నారు.
ఈ మధ్య కాలంలో పేరెంట్స్ తో పాటు వాళ్ళ పిల్లలు కూడా షోస్ కి వస్తున్నారు. బుల్లితెర నటి శ్రీవాణి వాళ్ళ అమ్మాయి నందిని ఢీ 20 లో కంటెస్టెంట్ గా చేస్తోంది. అలాగే రాఘవ వాళ్ళ అబ్బాయిని మురారిని జబర్దస్త్ స్కిట్స్ కి తీసుకొస్తూ ఉంటాడు. ఇక విశ్వా తన కొడుకు ర్యాన్ ని అలాగే అంజలి- పవన్ వాళ్ళ అమ్మాయి చందమామను, ఇంకా సమీరా భరద్వాజ్ వాళ్ళ అమ్మాయిని కూడా షోస్ కి తీసుకొస్తూ ఉంటారు.