English | Telugu
ఇమ్యూనిటి టాస్క్: పల్లవి ప్రశాంత్ ఆటలో సెకండ్.. ఓటింగ్ లో ఫస్ట్!
Updated : Sep 7, 2023
పుష్ప సినిమాలోని ఏ బిడ్డ ఇది నా అడ్డ పాటతో రెండవ రోజు బిగ్ బాస్ మొదలైంది. ఎన్నో ఉల్టా పల్టాలతో కొనసాగుతుంది బిగ్ బాస్. కంటెస్టెంట్స్ ఇప్పుడు జరిగే కమ్యూనిటి టాస్క్ లో ఎవరైతే ఎక్కువ సమయం రింగ్ లో ఉంటారో వారికి అయిదు వారాల పాటు ఇమ్యూనిటి లభిస్తుంది. అదేకాకుండా ఎలిమినేషన్ నుండి కూడా సేఫ్ అవొచ్చు. నామినేషన్లో ఉన్న ప్రాబ్లమ్ లేదని కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చెప్తాడు.
ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా కిచెన్ ఏరియాలో కాసేపు కోడిగుడ్లతో టాస్క్ ఆడతారు. అది బిగ్ బాస్ ఇచ్చాడా? లేదా పర్సనల్ గా ఆడుతున్నారా అర్థం కాదు. కాసేపటికి అందరూ బిగ్ బాస్ మాట కోసం ఎదురుచూస్తుంటారు. అప్పుడే రతిక నిల్చొని.. గాయ్స్ మనం మన సత్తా చాటి, మన ట్యాలెంట్ తో బిగ్ బాస్ కి గట్డి పోటీ ఇవ్వాలని అంటుంది. అది విన్న బిగ్ బాస్.. అయిపోయిందా రతిక అని బిగ్ బాస్ అనగానే అందరు నవ్వేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ రూల్స్ చెప్తాడు. బాక్సింగ్ రింగ్ లో ఇద్దరు ఫైటర్స్ ని చూపిస్తారు. మేల్ ఫైటర్, ఫీమేల్ ఫైటర్ ఇద్దరిని బాక్సింగ్ రింగ్ లో చూపించి వారితో మీరు తలబడి ఆ రింగ్ లో వీలైనంత ఎక్కువ సేపు ఉండాలని బిగ్ బాస్ చెప్తాడు. ఆ తర్వాత .. మాటల్లో కాదు చేతల్లో చూపించమని మొదటగా రతికని రింగ్ లోకి వెళ్ళమని చెప్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత కిరణ్ రాథోడ్ రింగ్ లోకి వెళ్ళి కాసేపు టైమ్ స్పెండ్ చేసి ఫైటర్ ని బయటకు తోసేస్తుంది. ఆ తర్వాత ఆట సందీప్ వెళ్ళి కాసేపు ఎదురిస్తాడు. ఇలా ఒక్కొక్కరుగా రింగ్ లోకి వెళ్ళి వారి ఇమ్యూనిటీ పవర్ ని సరిచూసుకుంటారు.
ఇమ్యూనిటి టాస్క్ లో అందరి కంటే ఎక్కువ టైమ్ రింగ్ లో ఉంది ఆట సందీప్, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్. తన ఇంటలిజెన్స్ తో అందరి కంటే ఎక్కువ టైమ్ ఉండి ఇమ్యూనిటీ టాస్క్ లో గెలిచాడు ఆట సందీప్. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ కొన్ని సెకండ్ల టైమ్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. ఫీమేల్ కంటెస్టెంట్స్ లో ప్రియాంక గెలిచింది. ఇక విజేతలు ప్రకటించాక పల్లవి ప్రశాంత్ ఏడ్చేసాడు. తన దగ్గరికి వెళ్ళి అందరు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇది గేమ్ ఆడుకుంటూ పోవాలే, ఏదో ఒక చోట గెలుస్తామంటూ టేస్టీ తేజ పల్లవి ప్రశాంత్ కి చెప్పాడు. ఇక పల్లవి ప్రశాంత్ దగ్గరికి ప్రియాంక జైన్ వచ్చి.. నాది ఇంటర్ పాస్, డిగ్రీ ఫెయిల్.. ఇలా ఉండిపోకు. కామన్ గా జరిగేది ఇదంతా అంటూ పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ ఇస్తుంది. " ఎవరి గేమ్ వారు ఆడుతున్నారు. మన గేమ్ మనం ఆడాలి. బి స్ట్రాంగ్ , గో స్ట్రాంగ్" అంటూ గౌతమ్ కృష్ణ తనని తాను సపోర్ట్ చేసుకుంటాడు.
