English | Telugu

తప్పుగా మాట్లాడిన ముకుందపై అరిచేసిన భవాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -255 లో.. కృష్ణ, ముకుంద, మురారి ఇంటికి వస్తారు. కృష్ణ డల్ గా ఉండడంతో ప్రసాద్ ఏమైందని అడుగుతాడు. ముకుంద చాలా హ్యాపీగా రెస్టారెంట్ లో జరిగిందంతా చెప్తుంది. కొంతమంది బాయ్స్ నన్ను చూసి మురారి భార్య అనుకున్నారట ఒక అతను మాత్రమే మురారి భార్య కృష్ణ అనుకున్నారట అని నవ్వుతు చెప్తుంది. అందుకు కృష్ణ డల్ గా ఉందా అని ప్రసాద్ అంటాడు. అవునని ముకుంద అంటుంది.

ఆ తర్వాత ముకుంద రెస్టారెంట్ లో జరిగింది చెప్తుంటే భవాని విని.. కోపంగా ముకుంద అని గట్టిగా అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నావ్? ఎవరో ఏదో అంటే ఆ విషయాన్ని పట్టుకొచి సరదాగా చెప్తున్నావా? అక్కడే వాడికి నాలుగు చివాట్లు పెట్టి రావలిసింది పోయి, ఇక్కడికి వచ్చి సరదాగా చెప్తున్నావా? వావి వరుసలు మర్చిపోయి మాట్లాడితే నేను ఒప్పుకోనని ముకుందని భవాని కోప్పడుతుంది. నీ భర్త ఎవరని ముకుందని భవాని అడుగుతుంది. ఆదర్శ్ అని ముకుంద చెప్తుంది. మరి మురారి ఎవరని అడగ్గానే నా భర్త ప్రాణ స్నేహితుడని ముకుంద చెప్తుంది. ఇంకొకసారి అలా అనకుండా ముకుందకి భవాని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరొక వైపు మధు, అలేఖ్య ఇద్దరు ముకుంద గురించి మాట్లాడుకుంటారు. నువ్వేంటి ముకుందకి సపోర్ట్ చేస్తున్నావని అలేఖ్యతో మధు అంటాడు. నువ్వేంటి కృష్ణకి సపోర్ట్ చేస్తున్నావని మధుతో అలేఖ్య అంటుంది.

మరొకవైపు కృష్ణ తనని తాను అద్దంలో చూసుకుంటూ.. ఒకరికి తప్ప, అందరికి నేను ఏసీపీ సర్ భార్యలాగా ఎందుకు అనిపించలేదు? నాకేం తక్కువ అని అనుకుంటుంది. ఇప్పటికి ఇప్పుడే అందంగా రెడీ అవ్వాలని అనుకొని అన్ని రకాల జ్యూస్ ల తాగుతుంది. అది చూసి ఏం చేస్తున్నావని మురారి అడుగుతాడు. ఫేస్ గ్లో కోసమని కృష్ణ సమాధానం చెప్తుంది. కృష్ణ నువ్వు బాగుంటావని మురారి చెప్తాడు. మీకు నచ్చితే సరిపోతుందా అని కృష్ణ అంటుంది. మరొక వైపు శ్రీనివాస్ తో ముకుంద మాట్లాడుతుంది. మీరు ఎలాగైనా నా ప్రేమ గురించి పెద్ద అత్తయ్యకి చెప్పాలి. కృష్ణని చూసి జాలిపడి, రేవతి అత్తయ్య మాట విని నిజం చెప్పకుండా ఉంటే నిజం మాత్రమే మిగులుతుంది. మీ కూతురు ఉండదని ముకుంద అనగానే.. శ్రీనివాస్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.