English | Telugu
బిగ్ బాస్ హౌజ్ లో ప్రేమజంట.. కామన్ మ్యాన్‌తో రితిక సంథింగ్ సంథింగ్!
Updated : Sep 7, 2023
బిగ్ బాస్ సీజన్-7 గత ఆదివారం గ్రాంఢ్ గా మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆసక్తిగా చూసే ఈ ఎంటర్టైన్మెంట్ షోకి క్రేజ్ మాములుగా లేదు. ప్రతీ సోమవారం నామినేషన్స్ తో హీటెడ్ గా సాగే హౌజ్, సండే ఫండే అంటూ హౌజ్ లోని వాళ్ళతో నాగార్జున గారు తీసుకునే స్పెషల్ ఎపిసోడ్, వీక్ మధ్యలో జరిగే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఇలా రోజుకొక కొత్త లీడ్ తో ఆధ్యాంతం ఆసక్తికరంగా సాగుతుంది ఈ బిగ్ బాస్.
అయితే ఈ బిగ్ బాస్ హౌజ్ లో ఈ సీజన్ కి పద్నాలుగు మంది మాత్రమే వచ్చారు. అందులో కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లివి ప్రశాంత్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. ఇది అందరికి తెలిసిందే. అయితే తాజాగా రతికకి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్ లో మొదటి రోజే నవీన్ పొలిశెట్టి వచ్చి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లాగా ఒక బ్యాండ్ ఇచ్చి, ఇది మేల్ కంటెస్టెంట్ మీకు నచ్చిన ఫీమేల్ కంటెస్టెంట్ ఒకరికి ఇది ఇవ్వాలని చెప్పగా.. రతికకి పల్లవి ప్రశాంత్ ఆ బ్యాండ్ ఇచ్చాడు. దాంతో అప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మొదలైంది. అయితే మొన్న జరిగిన నామినేషన్లో పల్లవి ప్రశాంత్, రతికలని హౌజ్ లోని వాళ్ళు నామినేట్ చేసినప్పుడు.. ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకొని బాదపడ్డారు. దీంతో ఇద్దరికి ఒకరంటే ఒకరికి బాండింగ్ పెరిగింది.
ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ ఇద్దరు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుండగా అక్కడికి రతికి వచ్చింది. ఏం చేస్తున్నావని పల్లవి ప్రశాంత్ ని రతిక అనగా.. ఏం లేదు నా దిల్ డ్రా చేసి గుండెల్లో నుండి ఈ కెమెరాల వెనుక ఉన్న ప్రేక్షకులకు ఇచ్చేసా అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. అది విని రతిక.. హో అవునా అయితే మరి నీ దిల్ ని ఈ హౌజ్ లోని వాళ్ళలో ఎవరికిస్తావని అడుగగా.. పల్లవి ప్రశాంత్ సిగ్గుపడ్డాడు. దాంతో నువ్వు చెప్పకుంటే నేను వెళ్తానని రతిక అంటుంది. మరి నీ దిల్ ని ఎవరికిస్తావని రతికని పల్లవి ప్రశాంత్ అడుగగా.. నీకే ఇస్తానని రతిక అంటుంది. అలా అనగా పల్లవి ప్రశాంత్ హ్యాపీగా ఫీల్ అయి గంతేస్తాడు. అక్కడే ఉన్న ప్రిన్స్ యావర్ విని, ఇంకేం నెక్స్ట్ మ్యారేజా అని యావర్ అనగా.. రతిక సిగ్గుపడుతుంది. అది చూసి మరింత సంబరపడతాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత నా దిల్ నీకే ఇస్తానని రతికతో పల్లవి ప్రశాంత్ అంటాడు. ఇక ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. నిన్న జరిగిన ఇమ్యూనిటి టాస్క్ తర్వాత రతికకి కొన్ని ఇన్సిపిరేషన్ మాటలు చెప్పాడు పల్లవి ప్రశాంత్. నీ ఆట నువ్వు ఆడు, కసిగా ఆడు అంటూ రతికతో పల్లవి ప్రశాంత్ అన్న మాటలు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు