English | Telugu
కళ్యాణం కోసం కంకణం కట్టించుకున్న రోహిణి...
Updated : Oct 31, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో భలే ఫన్నీగా ఉంది. కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ గా ఇది రాబోతోంది. ఈ షోకి రోహిణి, సుహాసిని, ప్రిన్సి, సమీరా భరద్వాజ్, కావ్య, సిరి హన్మంత్, నయని పావని, లాస్య మంజునాథ్, ప్రియాంక జైన్, గాయత్రి అంతా వచ్చారు. ఇక గోదావరి మూవీలో హిట్ సాంగ్ "అందంగా లేనా అస్సలేం బాలేనా" అనే సాంగ్ ని ఒక్కో లైన్ కి ఒక్కొక్కరు భలే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇక లాస్య ఎక్స్ప్రెషన్ కి ఐతే శ్రీముఖి ఫుల్ ఫిదా ఐపోయింది. "మంజు ఇది చూసాకా ఐపోతావ్ పుంజు" అంటూ శ్రీముఖి లాస్య గురించి చెప్పుకొచ్చింది. సమీరా ఐతే అదే సాంగ్ పాడుతూ కైపుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టేసరికి అవినాష్ చూసి "ఇది చూసి అబ్బాయిలంతా అల్లాడిపోతారు" అన్నాడు. ఇక హరి వచ్చి "మా సైడ్ నుంచి రోహిణిని డ్రాప్ చేస్తాం అటు నుంచి ప్రిన్సిని డ్రాప్ చేయండి" అని శ్రీముఖికి చెప్పాడు. తర్వాత రోహిణి కూడా అదే పాట పాడుతూ అందంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.
ఐతే లాస్ట్ లో సమీరా ఆ సాంగ్ ని ఖూనీ చేసేసరికి హరి ఫీలయ్యాడు "మీ వలన వచ్చిన రెండు పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్లిపోయాయి ఆవిడకి" అన్నాడు. వెంటనే రోహిణి "ఎస్క్యూజ్ మీ... కళ్యాణానికి కంకణం కట్టారు ఐపోతుంది" అనేసరికి హరి చూసి "కంకణం కడతారు తాళి కట్టరు" అనేశాడు పుసుక్కున. ఇక శ్రీముఖి ఇంకో టాస్క్ ఇచ్చింది "అందంగా లేనా" సాంగ్ ని సీరియస్ గా చేయమనేసరికి ప్రిన్సి పాడుతూ అవినాష్ ని, హరిని కొట్టింది. వెంటనే హరి "ప్రిన్సి ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేసావ్" అన్నాడు. "చాలా చేసాను" అంది. "ఈ యాక్టింగ్ తో అన్ని సీరియల్స్ ఎలా చేసావ్" అంటూ కౌంటర్ వేసరికి ప్రిన్సి అవాక్కయ్యింది.