English | Telugu

యష్మీ రాక్ డెసిషన్.. నిఖిల్ , సోనియా కన్నింగ్ బయటపడిందిగా!

సోమవారం నాటి నామినేషన్ కాంతారా టీమ్ వర్సెస్ శక్తి టీమ్ అన్నట్టుగా సాగింది. ఇక ఆ తర్వాత కొత్త ఛీఫ్ కోసం కంటెస్టెంట్స్ చేత సుత్తి టాస్క్ ఒక్కటి పెట్టాడు బిగ్ బాస్. అందులో చివరగా కిర్రాక్ సీత గెలిచి కొత్త చీఫ్ అయ్యింది.

ఇక కిర్రాక్ సీత క్లాన్ లోకి నైనిక, విష్ణుప్రియ, ఆదిత్య, యష్మీ , నబీల్ వచ్చారు‌. ఇక నిఖిల్ క్లాన్ లోకి ఎప్పటిలాగే సోనియా, పృథ్వీ ఉన్నారు. ఇక మణికంఠ వంతు రాగానే బిగ్ బాస్ మెలిక పెట్టాడు. సోనియా టీమ్ ఫుల్ అయ్యింది ఎవరినైన స్వాప్ చేసుకోవాలనగా‌‌.. సీత దానికి అంగీకరించలేదు‌. దాంతో నిఖిల్ క్లాన్ కి వెళ్ళాడు. ఇక చివరగా ప్రేరణ మిగిలింది. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ స్వాప్ చేసుకోమనగా.. ప్రేరణ నిఖిల్ టీమ్ లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు‌‌. దాంతో యష్మీ కన్విన్స్ అయ్యింది. అటు సీతకి, ఇటు ప్రేరణకి చెప్పేసి నిఖిల్ టీమ్ కి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తే సోనియా, పృథ్వీ మినహా హౌస్ మొత్తం సీత టీమ్‌లోకి వెళ్లేందుకే ఇష్టపడ్డారు. ఇక ఈ చీఫ్ లోని కంటెస్టెంట్స్ సెలక్షన్ అయిపోయిన తర్వాత సీత తన టీమ్‌తో మాట్లాడింది. నిఖిల్‌, సోనియాలపై గట్టిగానే కౌంటర్లు వేసింది. నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ క్లాన్‌కి వెళ్లలేదు.. ఇప్పుడైనా వాళ్లకి అర్థం కావాలి.. ఫ్రెండ్ షిప్, బాండ్ గురించి వాళ్లారా మాట్లాడేది.. మరి రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకిచ్చాడురా అంటూ సీత కౌంటర్ల మీద కౌంటర్లు వేసింది.

ఇక మరోవైపు నిఖిల్ ఎప్పటిలాగే పృథ్వీ, సోనియాలతో గుసగుసలు పెట్టాడు. యష్మీ తమ టిమ్ లోకి రావడం గురించి తన అనుమానాలని చెప్పాడు నిఖిల్. మణికంఠ.. అలానే యష్మీ కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏంటో ప్రూ చేయాలనే వచ్చింది.. నెగెటివ్ ఏంటి పాజిటివ్ ఏంటని.. కానీ ఈరోజు టీమ్ సెలక్షన్‌తో నాకు ఓ క్లారిటీ వచ్చింది.. మన త్రీ వర్సెస్ హౌస్ అన్నట్లుగా మొత్తం మారిపోయిందని నిఖిల్ అన్నాడు. నీకు లేటుగా అర్థమైందా అంటూ పృథ్వీ అన్నాడు. అది కాదురా నిన్ను ఇష్టపడేవాళ్లు నన్ను ఇష్టపడేవాళ్లు కూడా అపోజిట్ అయ్యారు.. ఎవరి దగ్గర నాకు లిమిట్‌గా ఉండాలనే క్లారిటీ వచ్చింది..నా క్లాన్‌కి వచ్చేసరికి మీ ఇద్దరికీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తానని వాళ్లు అనుకుంటున్నారు. అయిన సోనియాను హేట్ చేసే యష్మీ.. నిన్ను (పృథ్వీ) ద్వేషించే మణికంఠ ఇద్దరూ నా టీమ్‌లోకే వచ్చారు చూడమని నిఖిల్ అన్నాడు. ఇక అదే సమయంలో యష్మీ రావడంతో వాళ్ళు టాపిక్ ని ఆపేసి నార్మల్ గా మాట్లాడుకున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.