English | Telugu

ష‌ణ్ముఖ్ - దీప్తి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఉమారాణి

ష‌ణ్ముక్ జ‌స్వంత్ - దీప్తి సున‌య‌న గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో బిగ్‌బాస్ సీజ‌న్ 2లో దీప్తి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ స‌మ‌యంలో యంగ్ హీరో త‌నీష్‌తో హౌస్‌లో క్లోజ్‌గా వుండాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో షణ్ముఖ్ బ‌య‌టే వున్నాడు. త‌ను వుండ‌గా దీప్తి హౌస్‌లో త‌నీష్‌తో క్లోజ్‌గా వుంటోందంటూ ష‌న్ను పై విమ‌ర్శ‌లు వినిపించాయి. అయితే అదంతా గేమ్ వ‌ర‌కే అని ష‌న్ను - దీస్తి స‌రిపెట్టుకున్నారు.

ఇప్పుడు ష‌న్ను వంతు వ‌చ్చింది. సిరితో హ‌గ్గులు.. కిస్సులల‌తో ఓ రేంజ్‌లో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఇదిలా వుంటే ష‌న్ను - దీప్తిల పెళ్లికి ష‌న్ను పేరేంట్స్ కండీష‌న్స్ అప్లై అంటున్నారు. ఇటీవ‌ల ష‌న్నుని క‌ల‌వ‌డం కోసం హౌస్‌లోకి వెళ్లిన అత‌ని త‌ల్లి ఉమారాణిని దీప్తిని క‌లిశావా? అంటూ ప‌దే ప‌దే విసిగించాడు. క‌లిశాన‌ని చెప్పినా త‌న‌పై ఒట్టువేయ‌మ‌ని విసిగించేస‌రికి అమ్మ అబ‌ద్ధం చెప్ప‌దు అంటూ ఒకింత అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించింది.

ఇదిలా వుంటే ష‌న్ను - దీప్తిల పెళ్లిపై తాజాగా ఉమారాణి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వాళ్లిద్ద‌రూ యూట్యూబ్ వీడియోల‌తో క‌వ‌ర్ సాంగ్ ల‌తో పాపుల‌ర్ అయ్యారు. అంత వ‌ర‌కే మంచి ఫ్రెండ్స్ అనుకున్నాం. ఆ త‌రువాతే తెలిసింది. టీవీ షోల‌కు వెళ్ల‌డం.. టాటూలు వేయించుకోవ‌డం చూసి వాళ్లు ల‌వ్‌లో వున్నార‌ని అర్థ‌మైంది. ష‌ణ్మ‌క్‌కి ఇష్ట‌మైతే మాకూ ఇష్ట‌మే అయితే ముందు వాళ్ల పేరెంట్స్ అంగీక‌రిస్తేనే పెళ్లి జ‌రుగుతుంది. అలాగే మా పెద్ద‌బ్బాయి పెళ్లి కాకుండా మాత్రం ష‌న్ను వివాహం చేయ‌లేం. దీప్తి పేరెంట్స్ అంగీక‌రించి.. మా పెద్ద‌బ్బాయి వివాహం జ‌రిగాకే ష‌న్ను పెళ్లి చేస్తాం` అని ష‌న్ను మ‌ద‌ర్ ఉమారాణి క్లారిటీ ఇచ్చేసింది.