English | Telugu
మా బోనాల జాతరలో కీర్తి భట్ ఎంగేజ్మెంట్...సందడి చేసిన కార్తీదీపం జంట
Updated : Jun 24, 2023
ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసం మొదలవడమే బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. బోనాల జాతర అంటే చాలు అన్ని చోట్ల తీన్ మార్ డాన్సులు దుమ్మురేపుతూ ఉంటాయి . ఈ బోనాల జాతరను పురస్కరించుకుని చానెల్స్ కూడా షోస్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ మా ఛానల్ లో "మా బోనాల జాతర" ఈవెంట్ త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర ఆర్టిస్టులంతా పార్టిసిపేట్ చేసి ధూమ్ ధామ్ చేసేసారు. ఇక ఈ ప్రోమోలో కార్తీక దీపం దీప, డాక్టర్ బాబు, మోనిత హైలైట్ అయ్యారు. "ఊపులో ఉన్నారంటే తెలంగాణ జనాలు..మొదలయ్యాయి బోనాలు" అంటూ రవి మంచి జోష్ తో ఈ షో గురించిన ఇంట్రో చెప్పేసాడు. ఈ షోని రవి, వర్షిణి హోస్ట్ చేశారు. ప్రియదర్శి, కావ్య, బలగం వేణు కూడా డాన్సులు చేశారు. "సినిమా హిట్ ఐతే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది...లోకల్స్ వస్తే ఎంటర్టైన్మెంట్ దద్దరిల్లిపోద్ది" అంటూ నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు మంచి ఎనెర్జీతో డైలాగ్ చెప్పాడు. ఇక ఈ షోలో కళ్ళకు గంతలు కట్టి కుండల్ని కొట్టే పోటీ పెట్టారు. సైకిల్ పోటీలు, బెలూన్స్ ని పగలగొట్టే పోటీలు ఇలా నిర్వహించారు.
"కార్తీక దీపం సీరియల్ ఐపోయాక మీరు ఎవరిని బాగా మిస్ అయ్యారు" అని హోస్ట్ వర్షిణి అడిగేసరికి ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా అనే సాంగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంటే డాక్టర్ బాబు, దీప అలా హీరో హీరోయిన్స్ లా పరిగెత్తుకుని వస్తుండగా మధ్యలో మోనిత అడ్డుగా నిలబడింది. ఆ సీన్ చూసేసరికి అందరూ నవ్వేశారు. ఇక ఫైనల్ ఇందులో కీర్తి భట్ ఎంగేజ్మెంట్ ని కూడా చూపించారు. ఇక ఈ ప్రోమోకి నెటిజన్స్ కామెంట్స్ మాత్రం మాములుగా లేవు. "కీర్తి భట్ ఎంగేజ్మెంట్ వ్వావ్ కంగ్రాట్యులేషన్స్, వసుధారా ఒక్కటే వచ్చింది...మా రిషి సర్ ఎక్కడా...." అంటూ అడుగుతున్నారు