English | Telugu

బిపి ట్యాబ్లెట్స్ లేకుండా సీరియల్ ని ఎప్పుడు చూస్తాం సర్!

డైరెక్టర్ కుమార్ పంతం..గుప్పెడంత మనసు సీరియల్ తో పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్య స్టార్ట్ చేసిన బ్రహ్మముడి సీరియల్ కూడా అత్యధిక టీఆర్పీతో నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. దీంతో ఇప్పుడు స్టార్ మా టీవీ ఛానెల్ లో‌ ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నింటిలో టాప్ -5 లో ఈ రెండు సీరియల్స్ ఉండటం విశేషం.

కుమార్ పంతం.. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎంచుకున్నాడు. తను ఎంచుకున్న గుప్పెడంత మనసు కథని ఒక క్లాస్ అమ్మయి, కాలేజ్ ఎండి ని ఇంప్రెస్ చేయడం.. కాలేజ్ టాపర్ గా వసుధార రావడం, దానికి కాలేజ్ ఎండీ రిషి తనకి దగ్గర అవడంతో ఈ గుప్పెడంత మనసు సీరియల్ మరింత క్రేజ్ ని సంపాదించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి, వసుధారల లవ్ స్టోరీకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే చాలా ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. అలాగే డైరెక్టర్ కుమార్ పంతం చేస్తోన్న సీరియల్ బ్రహ్మముడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కవే.బ్రహ్మముడి సీరియల్ లో ప్రతీ పాత్రకి ఒక్కో ఇంపార్టెన్స్ ఇస్తూ కథని ఆసక్తికరంగా మలిచాడు. ఈ కథలో కావ్య పాత్రకి సింప్లిసిటిని అద్ది, బాగా డబ్బున్న కుటుంబంగా దుగ్గిరాల ఫ్యామిలీని వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు ‌చూపిస్తున్నాడు. స్వప్న పాత్రలో హమీదా, కావ్యగా దీపిక రంగరాజు, అపర్ణగా శ్రీప్రియ, రాజ్ గా మానస్, కళ్యాణ్ గా కిరణ్, కనకంగా నీపా, రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ.. ఇలా అందరూ తమ ఇన్ స్టాగ్రామ్ , యూట్యూబ్ లలో ట్రెండింగ్ లో ఉన్నవాళ్ళే.. ఇలా అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది. చింటు పంతం రాసిన ఈ కథ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సీరియల్ ముందు వరకు ఎవరికి అంతగా తెలియని డైరెక్టర్ చింటు పంతం.. బుల్లితెరపై ఈ సీరియల్ ని ఆరాధించే అభిమానుల వల్ల అందరికి తెలిసిపోయాడు. అతను ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేసిన మంచి స్పందన లభిస్తుంది.

ఇప్పుడు తాజాగా డైరెక్టర్ కుమార్ పంతం తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చనింగ్' స్టార్ట్ చేసాడు. అందులో అభిమానులు కొన్ని ప్రశ్నలు వేయగా డైరెక్టర్ కుమార్ పంతం క్రేజీగా సమాధానమిచ్చాడు. ' గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి గుడ్ డేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సర్' అని ఒకరు అడుగగా.. మనకి ఎప్పుడు గుడ్ డేసే అని కుమార్ చెప్పాడు. "గుప్పెడంత మనసులో ఏమైనా ట్విస్ట్ లు ఎక్పెక్ట్ చేయొచ్చా సర్" అని అడుగగా.. చాలా ఉన్నాయి దాచాం అని చెప్పాడు. "రిషీధారలని కలపండి సర్.. మాకు టెన్షన్‌ తో పిచ్చెక్కుతుంది సర్" అని అడుగగా.. ప్రేమికుల మధ్య గొడవలు లేకపోతే సరదా ఉండదబ్బా అని కుమార్ అన్నాడు. "సర్ బిపి ట్యాబ్లెట్స్ లేకుండా సీరియల్ ని ఎప్పుడు చూస్తాం సర్" అని ఒకరు అడుగగా.. కొన్ని రోజులు ఇలా ఎంజాయ్ చేయండని కుమార్ చెప్పాడు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.